వాణిజ్యపన్నుల శాఖలో బదిలీలపై ఆందోళన

నల్లబ్యాడ్జీలతో కొనసాగిన నిరసనలు
22న విజయవాడ కమిషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా

అమరావతి,జూలై16(జనం సాక్షి ): పునర్‌ వ్యవస్థీకరణకు ప్రభుత్వం నడుంబిగించడం తో ఉద్యోగుల్లో ఆందోళన కొనసాగుతోంది. లన . వ్యవస్థీకరణ పక్రియలో భాగంగా అధికారాలను కేంద్రీకృతం చేయనుంది. నూతనంగా ఏర్పాటైన కొత్త జిల్లాల నేపథ్యంలో ప్రాంతీయ కార్యాలయాలు (రీజనల్‌ కార్యాలయాలు) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. నూతనంగా రీజనల్‌ కార్యాలయాలు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పునర్‌ వ్యవస్థీకరణ పేరుతో తమ అధికారాలను ప్రాంతీయ కార్యాలయాలకు బదిలీ చేసే ఆలోచనను ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. పాలనా పరంగా రీజనల్‌ కార్యాలయాలు సౌలభ్యంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంటోంది.బదిలీ అంశం వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు ఆఫీసు టు ఆఫీసు విధానంలో
బదిలీల పక్రియ కొనసాగుతుండగా, తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం స్టేషన్‌ టు స్టేషన్‌ విధానంలో బదిలీలు జరగనున్నాయి. ఈ ప్రకియ కూడా పాత రెవెన్యూ డివిజన్‌ పరిధులను ప్రామాణికంగా తీసుకోవడం, గతంలో పనిచేసిన స్టేషన్‌లో ఇప్పుడు తిరిగి పనిచేయడానికి వీలు లేకుండా నిబంధనలు సడలించడంతో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్టేషన్‌ టు స్టేషన్‌ బదిలీల అంశాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, లేని పక్షంలో తీవ్రంగా నష్టపోతామని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునర్‌ వ్యవస్థీకరణ, స్టేషన్‌ టు స్టేషన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ దశల వారీ ఆందోళనలు చేపట్టారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ అసోసియేషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 13న ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కాగా, 14 నుంచి 18 వరకు కార్యాలయాల ముందు మధ్యాహ్న భోజన విరామ సమయాల్లో ధర్నా చేయాలని నిర్ణయించారు. 19, 20 తేదీల్లో డివిజన్‌ కార్యాలయాల ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నాలు, 22న విజయవాడలోని కమిషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేయాలని అసోసియేషన్‌ నిర్ణయించింది. వాఖ ప్రక్షాళనలో భాగంగా విజయవాడలో ఉన్న రెండు డిసి కార్యాలయాల్లో ఒకటి కృష్ణా జిల్లాకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో నూతనంగా విజయవాడ`3 పేరుతో విజయవాడకు కొత్త కార్యాలయం రానుంది. విశాఖపట్నంలో ఇప్పటి వరకు ఉన్న కార్యాలయానికి అదనంగా మరొకటి రానుంది. రాజమండ్రిలో నూతనంగా డిప్యూటీ కమిషనరు కార్యాలయం ఏర్పాటు కానుండగా, ఆదాయం లేని ప్రాంతాల్లోని సర్కిల్‌ కార్యాయాలను సవిూపంలోని సిటిఒ కార్యాలయాల్లో కలిపి వేయనున్నారు. ఇప్పటి వరకు ఉన్న సర్కిల్‌ కార్యాలయాలకు తోడు మరో నాలుగు నుంచి ఐదు కార్యాలయాలు పెరగనున్నాయి. ఆంధప్రదేశ్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెఆర్‌ సూర్యనారాయణ, జిఎన్‌ రమేష్‌కుమార్‌ ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సర్కిల్‌ కార్యాలయాలను బలహీనపరిచేలా ఉన్న ఈ పక్రియ శాఖకు, తద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించేలా ఉందని, బదిలీల విధానంపై అందరితో సమగ్రంగా చర్చించిన అనంతరం ఓ నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. పారదర్శకంగా లేకుండా జరుగుతున్న బదిలీ పక్రియను వ్యతిరేకించాలని వాణిజ్య పన్నులశాఖ రాష్ట్ర అసోసియేషన్‌ విజయవాడలో జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్ణయించింది.