వాణిజ్య రంగంలో తెలంగాణను నెం.1గా నిలుపుదాం
– మంత్రి కేటీఆర్
– ఒకరోజు ముంబై పర్యటన విజయవంతం
ఢిల్లీ,ఆగస్టు 18(జనంసాక్షి):వచ్చే నాలుగేళ్లలో తెలంగాణను వ్యాపార, వాణిజ్య రంగాల్లో నంబర్ వన్ గా నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు పోతున్నదని చెప్పారు. ఒక రోజు ముంబై పర్యటనలో భాగంగా పలువురు వ్యాపార దిగ్గజాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. పలు బిజినెస్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఫోర్త్ ఇంజెక్షన్ బ్లో మౌల్డింగ్ అండ్ పెట్ ఇంటర్నేషనల్ సమ్మిట్ కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.వంద ఏకరాల్లో సుల్తాన్ పూర్ లో మెదటి దశలో ఒక ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు రెండవ దశలో మూడు వందల నుంచి 500 ఏకరాల్లో ప్లాస్టిక్ సిటీ ని మెదక్ నిమ్జ్ పార్కులో ఏర్పాటు
మంత్రి ప్రజెంటేషన్ కు పలువురు పారిశ్రామిక వేత్తల అభినందనలు అర్ బిఐ గవర్నర్ ను కలిసిన మంత్రి రాబోయే నాలుగేళ్లలో (2020 నాటికి ) తెలంగాణను పలు వ్యాపార, వాణిజ్య రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కె.టి రామారావు తెలిపారు. ఒకరోజు ముంబాయి పర్యటనలో ఉన్న మంత్రి పలువురు వ్యాపార దిగ్గజాలు కలవడంతోపాటు, పలు సమావేశాల్లో పాల్గోన్నారు. ముంబాయిలో జరిగినలో మంత్రి పాల్గోన్నారు. మెత్తం దేశ, విదేశాల నుండి వచ్చిన సూమారు 600 వందల మంది ప్లాస్టిక్, ప్రెట్రోకెమికల్, ప్యాకేజింగ్ రంగాల పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గోన్న మంత్రి కెటియార్ తెలగాణలో అయా
పరిశ్రమలకున్నఅవకాశాలను ప్రసంగంలో వివరించారు. వచ్చే నాలుగేళ్లలో తెలగాణ రాష్ట్రం పలు రంగాల్లో అగ్రగామిగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఐటి,
ఏలక్ట్రానిక్స్, ఫార్మ, లైప్ సైన్సెస్, ఏరోస్పెస్, రక్షణ రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంచేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ఈ రంగాల్లో
వేగవంతంగా ముందుకు పోతున్నదని, టి హబ్, నూతన పారిశ్రామిక విధానం, ఫార్మసిటీ వంటి పలు అంశాలుఈ రంగాల్లో ముందుకు వెళ్లెందుకు దోహదం చేస్తున్నాయని వాటి గురించి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం పాలసీలతోపాటు మౌళిక వసతుల కల్పణకు ముందుచూపుతో వ్యవహరిస్తున్నదని మంత్రి తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో గత రెండేళ్లలో నిరంతర విద్యుత్ సరఫరా, టియస్ ఐపాస్, ఈజ్ అప్ డూయింగ్ బిజినెస్ మెరుగుదల వంటి అంశాలతో దేశంలోనే పెట్టుబడులకు అత్యుత్తమ స్నేహపూరిత వాతావరణం కలిగిన రాష్ట్రంగా ఉందని తెలిపారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంకు పెట్టుబడులకు మరో అదనపు ప్రయోజనంగా మంత్రి తెలిపారు. వంద
ఏకరాల్లో సుల్తాన్ పూర్ లో మెదటి దశలో ఒక ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రెండవ దశలో మూడు వందల నుంచి 500 ఏకరాల్లో ప్లాస్టిక్ సిటీ ని మెదక్ నిమ్జ్ పార్కులో ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్లాస్టిక్ పరిశ్రలు పెట్టె వారికి ఇచ్చే పలు ప్రోత్సకాలను మంత్రి వివరించారు. దీంతోపాటు అయా పెట్టుబడులకు,పరిశ్రలకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను సైతం మంత్రి అక్కడి పరిశ్రమల ప్రతినిధులకు తెలిపారు. మంత్రి ఇచ్చిన ప్రజెంటేషన్ పలువురు పారిశ్రామిక వేత్తలు అభినందనలు తెలిపారు.అర్ బిఐ గవర్నర్ ను కలిసిన మంత్రి అర్ బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ను మంత్రి కెటియార్ ముంబాయిలో కలిసారు. ఓూఓఇ సెక్టార్ లోని పరిశ్రమలు బ్యాంకు రుణాలు అందుకోవడంలో ఉన్న పలు సమస్యలను మంత్రి గవర్నర్ కు వివరించారు. దీంతోపాటు పలు యంయస్ యం ఈ రంగ సమస్యలను మంత్రి తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం ఈరంగంలోని పరిశ్రమలను అదుకునేందుకు తీసుకోబోతున్న చర్యలు వివరించి, పలు సూచనలను తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రాజన్ సేవలకు ఒక జ్జాపికను అందించారు.




