వామపక్ష పార్టీల కోటి సంతకాల సేకరణ
హైదరాబాద్: సమర్థవంతమైన ఆహార భద్రత చట్టాన్ని రూపొందించాలని కోరుతూ వామపక్ష పార్టీలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాయి. నారాయణగూడ కూడలి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు నారాయణ, రాఘవులు పాల్గోన్నారు. ఆహార భద్రత చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో సబ్సిడీని ఎత్తివేసేందుకు కేంద్రం నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టిందని రాఘవులు విమర్శించారు.