వాయుగుండంగా అల్పపీడనం.. 48 గంటల్లో భారీ వర్షాలు
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇదిలా ఉంటే ఈ నెల 18 నుంచి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిషాలలో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని.. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వాతావరణ శాఖ సూచనలను ప్రజలు గమనించి.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.