వాయుగుండం ప్రభావంతో ఎపిలో వర్షాలకు చాన్స్
అమరావతి,మార్చి5 (జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కారణంగా తమిళనాడులోని నాగపట్నం నుంచి 320 కిలోవిూటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడిరచింది . 13 కి.విూల వేగంతో వాయుగుండం ఉత్తర దిశగా కదులుతుందని తెలిపారు.
సాయంత్రం తమిళనాడు తీరానికి మరింత దగ్గరగా వాయుగుండం వచ్చే అవకాశం ఉందని తెలియజేసింది. దీంతో తమిళనాడు, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.