వాయు కాలుష్యంపై సుప్రీం మరోమారు ఆగ్రహం
ఎన్ని చర్యలు తీసుకున్నా కంట్రోల్ కావడం లేదని అసహనం
న్యూఢల్లీి,డిసెంబర్2 ( జనం సాక్షి ) : ఢల్లీిలో వాయు కాలుష్యం అంశంపై మరోసారి సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వాలు ఎన్ని చెబుతున్నా.. కాలుష్యం మాత్రం తగ్గడంలేదని సుప్రీం వెల్లడిరచింది. గత కొన్ని వారాల నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు ఏవిూ చేయడం లేదన్న ఆలోచన వస్తోందని విచారణ సమయంలో సీజే ఎన్వీ రమణ అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, ఢల్లీి ప్రభుత్వాలకు కోర్టు వార్నింగ్ ఇచ్చింది. పరిశ్రమలు, వాహనాల ద్వారా వచ్చే కాలుష్యంపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొన్నది. కఠిన కాలుష్య నియంత్రణ ప్రణాళికలను వెల్లడిరచాలని కోర్టు డెడ్లైన్ పెట్టింది. స్కూళ్లు తెరిచిన అంశంపై సీజే రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లు, నాలుగేళ్ల చిన్నారులు స్కూళ్లకు వెళ్తున్నారని, కానీ పెద్దలు మాత్రం వర్క్ఫ్రమ్హోమ్ చేస్తున్నారని, ఇది సరిగా లేదని కేజీ ప్రభుత్వంపై సీజే సీరియస్ అయ్యారు. విూ ప్రభుత్వ పాలనను నియంత్రించేందుకు ఒకరిని నియమిస్తామని కోర్టు చెప్పింది.