వారం రోజుల్లో పేదలకు ఇండ్ల పట్టాలు
డిప్యుటీ సీఎం మహమూద్ అలీ
హైదరాబాద్,జూన్3(జనంసాక్షి): స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా ముందుకు తీసుకెళ్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక సమస్యలన్నీ పరిష్కరించేందుకు మంత్రుల కమిటీలు చురుగ్గా కదులుతున్నాయి. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆధ్వర్యంలో స్వచ్ఛ హైదరాబాద్ పవర్ సప్లయి కమిటీ భేటీ అయింది. హైదరాబాద్ నగరంలో కరెంటుకు సంబంధించిన సమస్యలపై సమావేశంలో చర్చించింది. నగరంలో ఏయే ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలున్నాయో గుర్తించామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చెప్పారు. అవసరమైన చోట సబ్ స్టేషన్లు, లైన్ల ఏర్పాట్లపై చర్చించామన్నారు. ఈ నెల 9న సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఫైనల్ విూటింగ్ జరుగుతుందన్న ఆయన.. ఆ భేటీలో సీఎంకు తుది నివేదిక అందజేస్తామన్నారు. ఇక దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించి మాట్లాడుతూ మరో వారం రోజుల్లో పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసే కార్యక్రమం ప్రారంభిస్తామని మహమూద్ అలీ వెల్లడించారు.