వారసత్వం కల నెరవేరుతుంది

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): వారసత్వ ఉద్యోగాలను కల్పించడం ద్వారా సింగరేణి కార్మికులకు అండగా నిలిచింది సిఎం కెసిఆర్‌ అని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ వారసత్వం ప్రకటించగానే జాతీయ సంఘాలన్ని కుదేలయ్యాయని, కార్మికుల్లో మనుగడఉండదని భావించి, కోర్టులో పిల్‌ వేయించి వారసత్వాన్ని అడ్డుకున్నాయని, వారు అడ్డుకున్నంత మాత్రాన వారసత్వ ఉద్యోగాల కల్పన అగదని తెలిపారు. సింగరేణి కార్మికుడిని దేశ సరిహద్దుల్లోని సైనికుడితో సీఎం కేసీఆర్‌ పోల్చి వారసత్వాన్ని ప్రకటించారని, జాతీయ సంఘాల కుట్రపూరితంగా వ్యవహరించి అడ్డుకున్నాయని అన్నారు. వారసత్వాన్ని అడ్డుకున్నది ఎవరో కార్మికులందరికీ తెలుసని అన్నారు. వారసత్వాన్ని అడ్డుకునేం దుకు ఏఏ సంఘాలు కోర్టులో ఫిల్‌ దఖాలు చేశారో, పత్రికలన్ని రాశాయని తెలిపారు. కార్మికుల సంక్షేమాన్ని కాపాడేది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాత్రమేనని ఇది సింగరేణి కార్మికులు గుర్తించారని అన్నారు. కోల్‌ ఇండియా తరహాలో సింగరేణిలో కూడా అన్ని హంగులను టీబీజీకేఎస్‌ సాధించుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జాతీయ సంఘాలకు కార్మికులంతా ఊడిగం చేశారని, ఇకనుంచి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పక్షానే నిలుస్తారన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో మరిన్ని గనులను ప్రారంభించి వారసత్వాన్ని సాధించుకుంటామని పేర్కొన్నారు.