వారాంతపు సంత సమస్యలు పరిష్కరించండి
– సిపిఐ ఆధ్వర్యంలో ఎంపీడీవో కి వినతి పత్రం
టేకులపల్లి, ఆగస్టు 25( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలో ప్రతి శనివారం జరిగే వారాంతపు సంత లో సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో బాలరాజు కి సమస్యలను వివరిస్తూ గురువారం కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. టేకులపల్లి గోల్య తండా ఉమ్మడి గ్రామపంచాయతీ ఎలా పరిధిలో నిర్వహిస్తున్న ఈ వారాంతపు సంతలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వాటిని వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోతు రామ్ చందర్, అయితే శ్రీరాములు, కర్లపూడి సుందర పాల్ ఎంపీడీవోని కోరారు. అపరిస్కృతంగా చెత్తాచెదారంతో సంతపక్కనే వదిలేస్తున్నారని, అదేవిధంగా ప్రధాన రహదారిపై ఉన్న పాత వంతెన కూలే ప్రమాదం ఉన్నందున ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకుండా ఆ పాత వంతెన కిరువైపులా వ్యాపారాలు కొనసాగించడం ప్రజల రద్దీగా తిరుగుతుండడంతో వంతెన కూలి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందుకు తగు చర్యలు తీసుకోవాలని వారు వినతిపత్రంలో కోరారు.