*వార్డు అభివృద్ధే లక్ష్యం- మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్*

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ అన్నారు.
శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు ఇంద్రారెడ్డి కాలనీలో  సొంత  నిధులతో వార్డులో విద్యుత్ స్తంభాలు, సిసి రోడ్డు వేయించిన మున్సిపల్ వైస్ చైర్మెన్ బండి గోపాల్ యాదవ్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డులోని ప్రజలకు సిసి రోడ్డు, కరెంటు స్తంభాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలో ఎన్నోసార్లు నాకు తెలపడం జరిగిందని అన్నారు. మున్సిపాలిటీలో నిధులు లేకపోవడం వల్ల తాను సొంత నిధులతోని ఈ పనులు చేయడం జరిగిందన్నారు. తనకు ఓటు వేసి గెలిపించిన వార్డులోని ప్రజలందరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే అభివృద్ధి చేస్తున్నానన్నారు.
ఫోటో రైటప్ : ఇంద్రారెడ్డి కాలనీలో సిసి రోడ్ వేయిస్తున్న మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్.