*వార్త రాసినందుకు జర్నలిస్టు పై సర్పంచ్ బెదిరింపు*

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన ఓ పత్రిక విలేఖరి పై ఆ గ్రామ సర్పంచ్ బెదిరింపు. ఇలాంటి  బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు అని ఒ ప్రముఖ సంస్థ పత్రికలో పనిచేస్తున్న గైని శ్రీకాంత్ జర్నలిస్టు వాపోయారు. జర్నలిస్టు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేవారని గమనించాలని అదేవిధంగా అభివృద్ధి పథంలో ప్రజాప్రతినిధుల సేవా కార్యక్రమాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించే వ్యక్తి జర్నలిస్టు అని గుర్తు చేసుకోవాలన్నారు. మరోసారి బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని అన్నారు. వాస్తవాలు వెలికితీసే రిపోర్టర్లను ఇలా ఇబ్బందులకు గురి చేస్తే, అడిగే వారే లేర ని రెచ్చిపోయే అవకాశాలు దళారులకు ఆశా వాదులకు కల్పించిన వారవుతారని తెలిపారు. వాస్తవానికి కి
జర్నలిస్టుల కుటుంబానికి సరైన ఆర్థిక స్థోమత లేకపోయినా వేరే రంగాన్ని ఎంచుకోకుండా నిస్వార్థ హృదయంతో ప్రజలకు ఉపయోగపడాలి అన్న భావంతో ఎంతో మంది కొన్ని పత్రికా సంస్థలలో చేరి విలేకరులుగా సేవలందిస్తున్నారు. కానీ వారికి మర్యాద ఇవ్వక పోగా కొందరు రాయకీయ నాయకుల తొత్తులు అవమానాలకు గురి చేస్తున్నారు. ఇది చాలా సిగ్గు చేటు.వార్త రాశావు కదా మరోసారి వార్త రాస్తే నీ మీద కేసులు పెడతాము అని సర్పంచ్, అతనితోపాటు అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు.అయ్యా అధికారులారా..! మాకు మీ లాగా వేలకు వెలు జీతాలు రావు.. లంచాలు తీసుకునే వాళ్ళము కాము.. ఇంక ఏదైనా రాజకీయ పార్టీకి సంబన్ధించిన వార్తలు రాస్తే ఏకంగా ఆ నాయకుని తొత్తులు విలేకరుల మీద దాడికి పాల్పడుతున్నారు.ఈ మధ్య ప్రతి ఒక్కడు ఒక కొత్త మాట నేర్చుకున్నాడు. మీకు అక్రీడేషన్ ఉందా అని అడుగుతున్నారు ..! అసలు మీకు అక్రీడేషన్ ల గురించి ఏమి తెలుసు? పెద్ద పెద్ద సంస్థల లో పని చేస్తున్న వారికి కూడా మండలానికి 4 లేదా 5 అంతకు మించి అక్రీడేషన్ లు ఇవ్వరు. అయితే మిగిలిన వారు అందరూ విలేకరులు కాదా ? తప్పనిసరిగా ఈ విషయం ముందుగా అందరూ
ఇవి తెలుసుకోకుండా పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇంకోసారి మా పని మమ్ములను చేసుకోనివ్వకుండా మా విలేకరులను ఇబ్బంది పెట్టినట్టైతే వారు ఎంతటి వారు అయినా ఉపేక్షించేది లేదు.. తప్పకుండా కటిన చర్యలు తీసుకుంటాము మీ యొక్క పై అధికారులకు ఫిర్యాదు చేస్తాము లేదా న్యాయస్థానం ని ఆశ్రయించి కటిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాము.
నిస్వార్థ హృదయంతో ప్రజలకు సేవ చేస్తున్న ఒక విలేకరిని దూషించిన మీ తల్లిని దూషించిన ఒకటే. మాకు ఎన్ని ఆర్థిక సమస్యలున్నా.. మీ కోసం సేవలు చేస్తున్నా కూడా మీరు మమ్మల్ని దూషించిన కూడా మేము ఈ జర్నలిజం వదలం.