వాళ్ల భవిష్యత్తేమిటి ?
గడిచిన ఆరునెలల్లో శ్రీలంక జరిగిన ఘటన లకు భారత దేశ పౌర సమాజం స్పందించలేదన్న ఫిర్యాదు బాధిత తమిళుల నుంచే కాదు, శ్రీలం కు చెందిన మానవహక్కుల ఉద్యమకారుల నుంచి కూడా వచ్చింది. మనం తప్పు ఒప్పుకోవలసిందే. అయితే రాబోయో దినాల్లో ఈ స్పందన అవసరం ఇంకా ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి తప్పొప్ప కోవడమే కాదు, సవరించుకునే అవకాశం ఉంది.
ఎల్‌టీటీఈని అణచివేయడం అయిపోయింది కాబట్టి ఇంకా శ్రీలంక ప్రభుత్వం తమిళుల ఆకాం క్షల తీర్చడానికి పూనుకుంటుందన్న అభిప్రాయం ఆ ప్రభుత్వమే కాక మీడియాకు మనకు కల్గిస్తున్న ది. ఏమాత్రం ఇంగితం ఉన్నా ఆ దేశ పాలకులు అందుకు పూనుకోవడం సహజం కాబట్టి మనం సులభంగా నమ్ముతున్నాం. అయితే ఇది అత్యంత సందేహాస్పదమైన విషయం ఎందుకంటే శ్రీలంక భూభాగం బౌద్ద సింహళీయులకే చెందుతుంది అ న్నది ఆ దేశ అధికార రాజకీయాల భావజాలం.
అదొక రాజకీయ వైపరీత్యం కాదు, అన్ని రా జకీయ పార్టీల సామాన్య దృక్పథం. ఎల్‌టీటీఈ యుద్ధ సామర్థ్యం కారణంగా 1987లో ఒకసారి, 1995లో ఒక సారి, 2002లో ఒకసారి శ్రీలంక ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ ప్రతిపాదనలు చేయడానికి లేదా చర్చించడానికి సిద్దపడిన మాట వాస్తవమే గానీ నిజంగా దానిని అమలు చేసి సమ స్యను న్యాయబద్ధంగా పరిష్కరించుకునే ఉద్ధేశ్యం వారికి ఉండిందా, లేక వేర్పాటుకు తప్ప వేరే పరి ష్కారానికి ఎల్‌టీటీఈ ఒప్పుకోదు కాబట్టి నెపం ప్ర భాకరన్ మొండితనంపైన నెట్టేసి ఎత్తుగడగా ఆ ప్రతిపాదనలు చేశారా అంటే రెండో జవాబు వైపే వాస్తవిక పరిశీలన మొగ్గు చూపాల్సి ఉంటుంది.
ఇది ఆయా సందర్బాల్లో ఆ ప్రతిపాదనలు చ ేసిన దేశధ్యక్షుల నిజాయితికీ సంబంధించిన విష యం కాదు. పాలనాబాధ్యతలు చేపట్టిన వారు అ ప్పుడప్పుడు కొంత సంయమనం పాటించక తప్ప దు. అయితే తమిళులకు శ్రీలంక భూభాగంలో స మాన హక్కులు కల్పించే ఏ చర్యనైనా అమలు చే సే ప్రయత్నం చేసినట్టయితే దానికి శ్రీలంక సమా జంలో ప్రత్యేకించి బౌద్ద మత పెద్దల నుంచి రాగ ల జాత్యంహకార వ్యతిరేకతను ఎదుర్కొని నిలబెట్టే సంసిద్దత ప్రధాన పార్టీలైన ఎస్‌ఎల్‌ఫిలో గానీ యుఎన్‌పిలో గానీ ఉందని నమ్మడానికి దాఖాలా లు లేవు. భారత రాజకీయాల్లో గనక అన్ని పార్టీ లూ విశ్వహిందూ పరిషత్ స్వాములు భయపడి ప రిపాలిస్తున్నట్టయితే మైనారిటీలు మనుగడ గురిం చి వారు చేసే విధాన ప్రవచనాలు మనం ఏ మేర కు నమ్మగలుగుదుమో అన్న పోలిక చెప్పకుంటే వి షయం అర్థం కావచ్చు.
ప్రభాకరన్‌లో రాజకీయ చాతుర్యం లోపించ డం శ్రీలంక తమిళులకు నష్టం చేసిందన్న అభిప్రా యం చాలామంది పరిశీలకులు వ్యక్తం చేశారు. రాజకీయ పరిష్కారం గురించి ఒత్తిడి వచ్చిన సం దర్బాల్లో, నిజంగా న్యాయమైన రాజకీయ పరిష్కా రానికి రూపొందించి అమలు చేసే సంసిద్ధత శ్రీ లంక పాలకుల్లో లేదన్న విషయాన్ని బయటపెట్టే పద్దతిలో స్పందించే బదులు, రాజకీయ పరిష్కారా నికి ఎల్‌టీటీఈ సిద్ధం కాదని శ్రీలంక పాలకులు ప్రచారం చేయడానికి అనుకూలించే పద్దతిలో వ్య వహరించాడు. అదే ఎక్కువగా ప్రచారం అయిం ది. శ్రీలంక ప్రభుత్వం లోతైన వికేంద్రీకరణ స్వ యం పాలననూ తమిళులకు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నప్పటికీ ప్రభాకరన్ యుద్ధ తంత్రం ద్వారా త మిళుల విముక్తిని సాధించాలన్న మొండి పట్టుదల తో ఆ ప్రయత్నాలను తిరస్కరించడన్న అభిప్రా యం విస్తృతంగా ప్రచారం అయింది.
ప్రభాకరన్ మొండితనం నిజమే గానీ వీళ్ల సంసిద్ధత అబద్దం. ఇప్పుడు ఎల్‌టీటీఈ లేదు కాబ ట్టి అది పరీక్షకు నిలబడుతుంది. 1987లో అప్ప టి భారత ప్రభుత్వం ఒత్తిడి మేరకు జరిగిన ఒప్పం దాన్ని అమలు చేస్తామని అంటున్నారట! ప్రస్తుత భారత పాలకులు కూడా దానినే పరిష్కారంగా సూ చిస్తున్నట్టున్నారు. ఆనాడు ఆ ఒప్పందం ఫలితం గా శ్రీలంక రాజ్యాంగానికి 13వ సవరణ జరిగిం ది. అది జరిగి రెండు దశాబ్దాలు దాటింది. దానిని అమలు చేయకుండ శ్రీలంక పాలకులను తమిళులు ఆపలేదు. కానీ దానిని అమలు చేయలేదు. శ్రీ లరక రాజ్యాంగం ఆ దేశ ప్రభుత్వానికి, ప్రత్యేకిం చి నేరుగా ఎన్నుకబడే అధ్యక్షుని ఇచ్చిన విస్తంత అధికారాలను సడలించకుండ 13 వ రాజ్యాంగ స వరణ ద్వారా తమిళ ప్రాంతాలకు అధికార వికేం ద్రీకరణ చేశారు. కాబట్టి అదిచ్చే స్వయం ప్రతిపత్తి చాలా పాక్షికంగా ఉండబోతుంది. శ్రీలంక సమా జంలో ప్రజాతంత్ర శక్తులేవైనా బలంగా ఉండి ఉంటే అటువైపు నుంచి తమిళులకు న్యాయం చే యమన్న ఒత్తిడి లేదా కనీసం జాత్యంహకారులకు లొంగకూడదన్న ఒత్తిడి ఉండేదేమో. కానీ ఆ స మాజంలో ప్రజాతంత్ర శక్తుల బలం చాలా పరిమి తం. 1970 -71 సంవత్సారాల్లో పేద వర్గాల యువతను పునాది చేసుకున్న జనతా విముక్తి పె రుమణ అనే కమ్యూనిస్టు భావాలు గల సంస్థ ఒక పెద్ద తిరుగుబాటు లేవదీసింది. దాన్ని శ్రీలంక ప్ర భుత్వం చాలా క్రూరంగా అణచివేసింది. 10 వేల మంది దాకా చనిపోయారని అంచనా. 1980 ల చివరి భాగంలో వారు మరొక్కసారి తిరుగుబాటు చేయగా అంతకు రెండు మూడు రెట్లు ఎక్కువ ప్రా ణ నష్టం జరిగింది. అయితే జేవీపీ శ్రీలంక దక్షిణ ప్రాంతంలో బలమైన రాజకీయ శక్తిగా ఇవ్వాల్టికి ఉంది. ఒక పార్టీగా ఎన్నికల రాజకీయాల్లో ఉంది.
ఆ పార్టీ కమ్యూనిస్టు పార్టీగానో కొనసాగివుం టే, లెనిన్ కాలం నుంచి జాతుల ఆ కాంక్షలకు క మ్యూనిస్టు సిద్దాంతంలో ఉన్న గుర్తింపు సింహళ ప్రజానీకం ఆలోచనా రీతుల్లో విస్తృంగా భాగమై ఉండేది, తమిళుల ఆ కాంక్షల న్యాయమైన పరిష్క రానికి సింహళీయులోనూ ఆ మేరకు మద్దతు దొరి కేది. దురదృష్టవశాత్తు జేవీపీ ఇతర విషయాల్లో క మ్యూనిస్టు పరిభాషనింకా విడిచిపెట్టలేదు. గానీ సింహళీయ జాత్యాహంకారాన్ని ఒంట బట్టించు కుంది. శ్రీలంక రాజకీయల్లో బౌద్ద భిక్షవుల తరపు న మెజారిటీ దురంహకారానికి బౌద్ద భిక్షవుల స రసన అత్యంత మిలిటెంటు ప్రతినిథిగా మారింది. ఇక చిన్నాచితకా వామపక్ష పార్టీలు, కార్మిక సం ఘాలు, ప్రజాతంత్ర భావాలుగల బుద్ది జీవులు సింహళీయుల్లో లేకపోలేదుగానీ వారి ప్రభావం చాలా బలహీనమైంది. శ్రీలంకలో బుద్ది జీవుల వి విధ విషయాల గురించి జరుపుకునే సంవాదాల్లో లోతైన సిద్దాంత విపేచన ఉంటుందనీ మన దేశం తో పోలిస్తే ఆ సమాజపు మేధో ప్రమాణాలు ఉన్న తమైనవనీ తెలిసిన వారు అంటారు. అదే నిజమై తే సంతోషించదగ్గ విషయమే.
శ్రీలంక పాలకుల ఉద్ధేశ్యాల విషయానికొస్తే 2004 సునామిలో భారిగా దెబ్బ తెన్న దేశ ఉత్తర ఈశాన్య ప్రాంతపు భూములను అమెరికా, భారత్ ల సహయంతో పునవాసయోగ్యం చేసిన తరువా త కొర్పొరేటు కంపెనీలకు అప్పగించే ప్రయోగమే దై తే నడుస్తున్నదో, ఎల్‌టీటీని తుదముట్టించడాని కి ఖాళీచేసిన అదే ప్రాంతపు భూములను గ్రామా లనూ ఆ ప్రయోగంలో భాగం చేస్తారని, అక్కడి నుంచి ప్రభుత్వ క్యాంపులకు తరలించిన తమిళుల కు వేరే చోట పునరవాసం కల్పింస్తారనీ, లేదా సిం హళీయులను ఖాళీ ప్రాంతానికి తరలించి ఇజ్రా యెల్ నమూనాలో మెజారిటీ వర్గం సెటిల్‌మెంట్లు స్పష్టిస్తారనీ అనుమానం. స్వయం ప్రతిపత్తి పేరటి కింది స్థాయిలో కొంత అధికార వికేంద్రీకరణ చేపట్టి మాత్రం దేశాధ్యక్షుని పాలనాధికారాన్ని కొ నసాగించడం ద్వారా దానికి పరిమితులు విధించి చేతులు దులిపేసుకోవచ్చు. దీనిని ఎదుర్కోగల బ లమైన రాజకీయ శక్తి ఏదీ శ్రీలంక తమిళులో ఈ రోజు లేకపోవడానికి ఎల్‌టీటీఈ బాధ్యత ఉంది. శ్రీలంక జాత్యంహకార పాలకులకు వ్యతిరేకంగా ఎల్‌టీటీఈ వీరోచితమైన పోరాటం. చేసిన మాట వాస్తవమే మానవ బాంబు వంటి అత్యంత సందే హాస్పదమైన పోరాట రూపాన్ని మానవాళికి ఇచ్చిన ఘనతనూ ఆ మానవ బాంబులు బజార్లో ప్రయో గించి నిరాయుధులైన పౌరలను హతమార్చి న ఘ నతనూ కూడా మూటగట్టుకున్నప్పటికీ, క్రూరమైన శ్రీలంక రాజ్యానికి వ్యతిరేకంగా క్రూరమైన పోరా ట రూపాలనను అనుసరించి తప్పలేదని వాదించ డానికి ఎల్‌టీటీఈకి అవకాశం లేకపోలేదు. అయి తే తమిళ ప్రజానీకానికి తానే ఏకైక ప్రతినిధిని, తా ను చెప్పినట్టు తమిళ ప్రజలు నడుచు కోవాలని, తనకు ప్రత్యర్థులు కాదు సరికదా ప్రత్య మ్నాయ సహితం తమిళ సమాజంలో ఉండడానికి వీలు లే దని శాసించడంలో ఎల్‌టీటీఈ అంతే క్రూరంగా వ్యవహరించింది. ఎల్‌టీటీఈ అనుమతి లేకుండా తమిళుల దక్షిణాదికి పోవడానికి వీలులే దు. ఎం తమంది పిల్లలను పోరాటానికి ఇమ్మంటే అంత మందిని ఇవ్వాల్సిందే తన కార్యకర్తకు క వచంగా ఉండమంటే ఉండవలసిందే.