వాషింగ్టన్‌ అడవుల్లో దావాగ్ని

1

13 మంది మృతి

హైదరాబాద్‌ ఆగస్ట్‌22(జనంసాక్షి):

అమెరికా వాషింగ్టన్‌ రాష్ట్రంలోని అడవుల్లో గత కొద్ది రోజులుగా కార్చిచ్చు దావానలంలా వ్యాపిస్తోంది. మంటలను అదుపుచేసేందుకు వచ్చిన ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది అగ్నికి ఆహుతయ్యారని అధికారులు తెలిపారు. కార్చిచ్చు అనేక పట్టణాలకు వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు దావాగ్ని కారణంగా 13మంది మృతి చెందారు. పరిస్థితి అదుపు తప్పడంతో అమెరికా అధ్యక్షుడు ఒబామా వాషింగ్టన్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దావాగ్నిని చల్లార్చేందుకు అమెరికాతో పాటు ఆస్గేలియా, న్యూజిలాండ్‌ దేశాల నుంచి దాదాపు 29వేల మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మంటల కారణంగా ఆ ప్రాంతంలోని పలు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు తెలిపారు. హెలికాప్టర్ల సహాయంతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.

గతంలో సంభవించిన కార్చిచ్చుల వివరాలు…

ఉత్తర అమెరికా

ఉత్తర అమెరికాలో అటవీ ప్రాంతం ఎక్కువగా వుంది. దీంతో ఇక్కడ అడవులు కూడా ఎక్కువశాతం దావాగ్నికి బలైపోతున్నాయి. 2000వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 40సార్లు ఉత్తర అమెరికా అడవుల్లో కార్చిచ్చు సంభవించింది. అందులోనూ ఎక్కువగా అమెరికాలోని కాలిఫోర్నియాలోనే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.

2014వ సంవత్సరంలో వాషింగ్టన్‌ రాష్ట్రంలోని అడవుల్లో కార్చిచ్చు సంభవించి దాదాపు 2,52,000ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. వాషింగ్టన్‌ రాష్ట్రంలోనే ఇంత పెద్ద దావానలం ఇప్పటి వరకు సంభవించలేదు. దాదాపు 300ఇళ్లు ఈ ప్రమాదంలో బూడిదయ్యాయి.

1825వ సంవత్సరంలో న్యూబర్న్‌స్విక్‌ ప్రాంతంలోని సంభవించిన కార్చిచ్చులో 160మంది మృత్యువాతపడ్డారు.

2014వ సంవత్సరంలో బ్రిటీష్‌ కొలంబియాలోని అడవుల్లో దావాగ్ని వ్యాపించింది. దీంతో 3,30,555ఎకరాల అడవి పూర్తిగా అగ్నికి ఆహుతెయపోయింది. ఈ మంటలను ఆర్పడానికి అధికారులకు నెలన్నరపైనే పట్టింది.

2015 సంవత్సరంలో డేవెల్లే, ఆరిగాన్‌ ప్రాంతాల్లో కార్చిచ్చు సంభవించి 27వేల ఎకరాలు దహనమయ్యాయి. దాదాపు 15రోజులపాటు ఈ మంటలు వ్యాపించాయి.

2015 సంవత్సరం వాషింగ్టన్‌లో దావాగ్ని సంభవించి వేల ఎకరాలు అగ్నికి ఆహుతికాగా.. మంటలు ఆర్పేందుకు వచ్చిన ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది కూడా మృత్యువాతపడ్డారు.

చెయనా

చెయనాలోని 1987లో ఒకసారి ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. అప్పుడు దాదాపు 3మిలియన్‌ ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి.

ఇండోనేషియా

ఇండోనేషియాలో కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కువగానే చోటుచేసుకుంటాయి. 1982-1983 సంవత్సరాల మధ్యకాలంలో కాలిమంటన్‌, తూర్పు సుమత్ర ప్రాంతాల్లో కార్చిచ్చు వ్యాపించి 14వేల చదరపు మైళ్ల అటవీప్రాంతం దహనమయ్యాయి.

ఇవే ప్రాంతాల్లో 1997-98 సంవత్సరాల మధ్యకాలంలో మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అప్పుడు 97వేల చదరపు కిలోమీటర్ల అగ్నికి ఆహుతయ్యాయి.

జపాన్‌

జపాన్‌లో 1971లో ఒకసారి కురే కాన్షు ప్రాంతాల్లో కార్చిచ్చు సంభవించింది. ఆ మంటలను అదుపుచేయడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బందుల్లో దాదాపు 18మంది సజీవదహనమయ్యారు. 340హెక్టార్ల అటవీప్రాంతం అగ్నికి ఆహుతయ్యింది.

ఇజ్రాుౖల్‌

ఇజ్రాుౖల్‌లోని మౌంట్‌ కార్మెల్‌ అడవిలో 2010లో ఒకసారి కార్చిచ్చు సంభవించింది. ఈ ఘటనలో 44మంది మృతిచెందగా, 41చదరపు కిలోమీటర్లు అగ్నికి ఆహుతయ్యాయి.

సౌత్‌కొరియాలోని అటవీప్రాంతాల్లో రెండు సార్లు, ఆస్గేలియాలో ని అటవీప్రాంతాల్లో 12సార్లు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

ఫ్రాన్స్‌లో 1949లో లాండెస్‌ అటీప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 82మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

పోర్చుగల్‌లో 2003లో ఒకసారి కార్చిచ్చు సంభవించి పోర్చుగల్‌లోని దాదాపు 10శాతం అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతెయంది. 18మంది మృత్యువాతపడ్డారు.

స్పెయిన్‌లో 2005లో ్ణొడాలజర ప్రాంతంలో దావాగ్ని చెలరేగగా.. 11మంది అగ్నిమాపక సిబ్బంది సజీవదహనమయ్యారు.