విఆర్ఎల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
విధుల్లో విఆర్ఎ లు లేకపోవడం వల్ల ఎక్కడి సమస్యలు అక్కడే
భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (3)జనంసాక్షి న్యూస్
రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఎ చేస్తున్న సమ్మె సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని విఅర్ఎ జెట్ రాజు డిమాండ్ చేశారు శనివారం నాడు భీమదేవరపల్లి మండల కేంద్రములోని తహశీల్దార్ కార్యాలయంలో విఆర్ఎలు చేస్తున్న నిరాహార దీక్ష, 41 రోజులు గా విఆర్ఎ చేస్తున్న సమ్మెకు
విఆర్ఎ లు విధుల్లో లేకపోవడం వల్ల రెవెన్యూ అధికారులకు క్షేత్ర స్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే నిలిచి పోయి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కలగజేసుకొని వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
