విఆర్ఎ లు వీధి విధి తిరుగుతు బిక్షాటన చేస్తూ విన్నుత నిరసన

పాలక వీడు(జనంసాక్షి) న్యూస్:రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు చేస్తున్న 46వ రోజు దీక్షలో భాగంగా పాలకీడు మండల కేంద్రంలో వీఆర్ఏలు విన్నుత రీతిలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు.మండల కేంద్రంలోని పండ్ల దుకాణాలు,టిఫిన్ సెంటర్లు, కిరాణా కొట్టు,పోలీస్ స్టేషన్ ఇతర కార్యాలయాల వెంట తిరిగి ప్రజల మద్దతు కోరారు.పాలకీడు మాజీ సర్పంచి సీనియర్ సిటిజన్ బైరెడ్డి రాఘవరెడ్డి, స్థానికులు జానీ,ఈశ్వరయ్య తదితరులు తోచినంత ఆర్థిక సహాయం చేయడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. సిఐటియు జిల్లా నాయకుడు కందగట్ల అనంత ప్రకాష్ వారికి మద్దతు తెలిపారు.సెప్టెంబర్ 9 2020 న తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన రెవెన్యూ చట్టంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ,వీఆర్ఏలకు పేస్కేలు,వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు.గత రెండు సంవత్సరాలుగా హామీని అమలుపరిచినందుకే వేల మంది వీఆర్ఏలు రోడ్డు ఎక్కారని విమర్శించారు.గత 46 రోజులుగా వీఆర్ఏలు దీక్షలు చేస్తు, కొందరు ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారని వాపోయారు.ఇప్పటికైనా ప్రభుత్వం వీఆర్ఏల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని సిఐటియు పక్షాన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో హిమామ్,మట్టయ్య, సైదులు, రసూల్,విజయ,జానీ,రాజు, రామయ్య,తదితరులు పాల్గొన్నారు.