విఆర్ఏల కు సియం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి

మహబూబాబాద్ బ్యూరో-జూలై
(జనంసాక్షి)

రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న విఆర్ ఏ లకు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలని సిఐటియు మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి విఆర్ఏ ల జెఎసి తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె మంగళవారం రెండవ రోజుకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలలో విఆర్ఏలు వారి డిమాండ్లతో సమ్మె నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా గార్ల మండలంలోని విఆర్ ఏల నిరవధిక సమ్మెకు సిఐటియు మండల కమిటీ అధ్వర్యంలో సంఘిబావం ప్రకటిస్తూ దీక్ష లో కూర్చున్నారు. విఆర్ ఏల తో వెట్టి చాకిరి లు చేయించుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం వారికి ఇచ్చిన హమిలను మూడేండ్ల నుండి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. విఆర్ఏల కు పే స్కేల్ వర్తింపజేసి, అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని, వయస్సు ఐపోయిన విఆర్ఏ ల ఉద్యోగాలు వారి వారసులకు కల్పించి వారికి పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విఅర్ ఏల సమస్యలు పరిష్కరించే వరకు అండగా ఉంటామని పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.ఈ కార్యక్రమంలో విఆర్ఏ ల సంఘం అధ్యక్షులు ఎద్దుల వెంకన్న, ఉపాధ్యక్షులు భూక్య వెంగళరావు, మాలోత్ మౌనిక, వేశమల్ల శ్రీను, పోతుల వీరయ్య, బాదం రాము, బండారి నాగమ్మ, బొడ్డు అచ్యుత్ రావు, భూక్య శ్రీను, కాయం రాంబాబు, దాసరి సత్యనారాయణ, కమటం అనిల్, ఎద్దుల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Attachments area