విఆర్ఏల పట్ల కేసీఆర్ మొండి వైఖరి విడనాడాలి..
*వీఆర్ఏల ఆధ్వర్యంలో మునుగోడులో పే స్కేల్ జాతర
మునుగోడు ఆగస్టు28(జనంసాక్షి):
గ్రామ రెవిన్యూ సహాయకులు గత 34
రోజులు గడిచిన ముఖ్యమంత్రి
సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో
మొండివైఖరి విడనాడడం లేదని విఆర్ఏ ల సంఘం నాయకులు అన్నారు.
ఆదివారం వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు మండల కేంద్రంలో నల్గొండ జిల్లా వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో బతుకమ్మలు పోతురాజులు డబ్బులతో భారీ ర్యాలీ చేపట్టి అంబేద్కర్ చౌరస్తాలో
పే స్కేల్ జాతరను నిర్వహించారు.అనంతరం జిల్లా వీఆర్ఏ జేఏసీ కమిటీచైర్మన్ నార్ల శ్రీనివాస్,సలీం, మాట్లాడుతూ ముఖ్యమంత్రి
2020లో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పేస్కేల్ ను మూడు విడతలుగా వి ఆర్ ఏ లకు ఇచ్చిన వాగ్దానం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.విఆర్ ఏ లలో అత్యధికులు దళితులు పేదలుగా ఉన్నారని విఆర్ఏల పేస్కెల్ గొంతెమ్మ కోరిక కాదని సీఎం ఇచ్చిన వాగ్ధానమేనని గుర్తు చేశారు.ప్రభుత్వం బేషజాలకు పోకుండా తక్షణమే విఆర్ఏ సమస్యలు పరిష్కరించాలన్నారు.పేస్కెల్,వారసులకు ఉద్యోగాలు అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.విఆర్ఏలలో అత్యధికులు బలహీనవర్గాల వారని వారంతా మా పేద బిడ్డలని వారికి తప్పక పే స్కెల్ అమలు చేస్తానని చెప్పి నేడు నోరు మెదపడం లేదని విమర్శించారు తక్షణమే విఆర్ఏలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవలన్నారు.
అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలని కోరారు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు లేని ఎడల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో
జిల్లాకమిటీ సభ్యులు అద్దంకి వెంకటయ్య, జిల్లాకమిటీ కోకన్వీనర్ వడ్డేపల్లి నరసింహ, ఎం.రెహమాన్,మునుగోడు మండల వీఆర్ఏ అధ్యక్షులు సిహెచ్ మల్లయ్య , ఉపాధ్యక్షులు యాదయ్య,లింగస్వామి, నరసింహ,శంకర్,రామలింగయ్య,నరేందర్, ధనసూర్య,తదితరులు ఉన్నారు.