విఆర్ఏ లకు సంఘీభావం తెలిపిన బీసీ జనసభ జిల్లా అధ్యక్షులు చల్లా గోవర్ధన్
బయ్యారం,జులై27(జనంసాక్షి):
రాష్ట్రవ్యాప్తంగా విఆర్ఏలు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు బుధవారం మూడో రోజుకు చేరుకున్నాయి.ఈ సందర్బంగా బయ్యారం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న విఆర్ఏలకు మద్దతుగా మహబూబాబాద్ జిల్లా బీసీ జనసభ అధ్యక్షులు సంఘీభావం తెలియజేశారు.తదుపరి ఆయన మాట్లాడుతూ…ముఖ్య మంత్రి అసెంబ్లీ సాక్షి గా ఇచ్చిన హామీ ప్రకారం పే స్కేల్ జిఓ వెంటనే విడుదల చేయాలని, విఆర్ఎల సమస్యల పట్ల సిసిఎల్ఎ నిర్లక్ష్య వైఖరి ఖండిస్తున్నామని,అర్హత కలిగిన విఆర్ఎలందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని,55 సంవత్సరాలు పైబడిన విఆర్ఎ వారసులకు ఉద్యోగాలు ఇచ్చి, వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని బీసీ జనసభ తరపున డిమాండ్ చేశారు.పెరిగిన నిత్యా అవసర వస్తువుల ధరలకనుగునంగా 10,500 రూపాయలు జీతంతో కుటుంబాలను పోషించే స్థితిలో వారు లేరని,బయటినుంచి అప్పులు తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారని,తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక కొంత మంది విఆర్ఏ లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏ లకు పే స్కెల్, పదోన్నతులు కల్పించి విఆర్ఏ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.దీనిపై బయ్యారం తహసీల్దార్ రమేష్ బాబు వివరణ కోరగా… అయన స్పందిస్తూ…విఆర్ఏల న్యాయపరమైన సమస్యలు గుర్తించి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని తమ వ్యక్తిగత సంపూర్ణ మద్దత్తు తెలియజేశారు.కార్యక్రమంలో విఆర్ఏ మండల అధ్యక్షుడు దామోదర్,ఉపాధ్యక్షులు సుమన్, కార్యదర్శి జ్యోతి,మోహన్, ముత్తయ్య,బేబీ,రాజు,మంగయ్య, యమునా,అరుణ,అలివేలు, తదితరులు పాల్గొన్నారు. ముత్తయ్య,బేబీ,రాజు,మంగయ్య, యమునా,అరుణ,అలివేలు, తదితరులు పాల్గొన్నారు.