వికలాంగులకు కృతిమ అవయవాలు
శ్రీకాకుళం, జూలై 28 : కెప్స్ మెమెరియల్ సొసైటీ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉచితంగా కృతిమ అవయవాలు (కాళ్లు) సరఫరా చేయనున్నట్లు సంస్థ కార్యదర్శి డి.శ్రీకాంత్ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. కృతిమ కాళ్లు అవసరమైన వారికి ఈ నెల 30వ తేదీన కొలతలు తీసుకొని నెల రోజుల తరువాత అందజేస్తామని తెలిపారు. అవసరమైన వికలాంగులు కాళ్ల కొలతలను స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ, ఎంఐజి 35, సంతోషిమాత గుడి దగ్గర తమ సంస్థ కార్యాలయంలో అందజేయాలని కోరారు. వివరాలకు 9390612686 నంబరును సంప్రదించాలని కోరారు.