విజయంపై కెప్టెన్ల ధీమా..

ప్రపంచకప్ పూర్తి చేసుకుని కొద్దిరోజులైనా గడవకముందే ఐపీఎల్ హోరు మొదలైంది.  చెప్పాలంటే ఇది క్రికెట్ అభిమానులకు పెద్ద పండుగే. ఐపీఎల్ సీజన్ – 8 లో భాగంగా తొలి మ్యాచ్లో ఆడే జట్లు రెండూ బలమైనవే. 2013లో జరిగిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది. గత ఏడాది జరిగిన ఐపీఎల్లో విజేతగా నిలిచింది కోల్కత్తా నైట్ రైడర్స్. అయితే గంభీర్ సేన ఇప్పటికే రెండు టైటిల్లను తన ఖాతాలో వేసుకుంది . తాజాగా జరిగే ఐపీఎల్ తొలిరోజే ఈ రెండు జట్లు తలపడటంపై అభిమానులకు భారీగా అంచనాలున్నాయి.

పాత జ్ఞాపకాలను పునరావృతం చేస్తామని రోహిత్ సేన ఎంతో ధీమాగా ఉంది. ముంబై కంటే తామేమీ తక్కువ కాదన్నట్టు నైట్ రైడర్స్ జట్టు కూడా అంతే ధీమా కనపరుస్తోంది. ఏ టోర్నీకైనా  తొలిమ్యాచ్ చాలా కీలకం. టాస్ గెలిస్తే బ్యాటింగ్ చెయ్యాలా ? లేక బౌలింగ్ ఎంచుకోవాలా అనే దగ్గర నుంచి టెన్షన్ మొదలవుతుంది. బుధవారం సాయంత్రం ఈ రెండు జట్లు మధ్య జరిగే మ్యాచ్పై వేటికవే ధీమాగా ఉన్నాయని చెప్పవచ్చు.

కోల్కతా నైట్ రైడర్స్ జట్టులోని కీలక ఆటగాళ్లు: గౌతం గంభీర్ (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, యూసఫ్ పఠాన్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, మనీష్ పాండే, షకిబ్ అల్ అసన్, మోర్నీ మోర్కెల్, ఆండ్రీ రసెల్.

ముంబాయి ఇండియన్స్ జట్టులోని కీలక ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), అంబటి రాయుడు, పార్థివ్ పటేల్, హర్బజన్ సింగ్, ఉన్ముక్త్ చంద్, వినయ్ కుమార్, లసిత్ మలింగ, కీరన్ పోలార్డ్, కోరె అండర్సన్, జోష్ హాజల్వుడ్, అరోన్ ఫించ్.

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ముంబై ఇండియన్స్ – కోల్కత్తా నైట్రైడర్స్ మ్యాచ్ చూడాలంటే బుధవారం సాయంత్ర ఆరు గంటల వరకు వేచి ఉండాల్సిందే.