విజయమ్మ దీక్షను అడ్డుకోవాలి: కోదండరాం
ఖమ్మం: తెలంగాణాపై స్పష్టత ఇవ్వకుండా వైకాపా నేత విజయమ్మ సిరిసిల్లలో చేనేత కార్మికులకు మద్దతుగా దీక్ష చేపట్టారాదని తెలంగాణ ఐకాస రాష్ట్ర కన్వీనర్ కోదండరాం అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రజలు పిలుపునిచ్చారు. ఖమ్మంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ పోలవరం నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్న టెండర్లు పిలవటం సరైంది కాదన్నారు. వైకాపా పోలవరంతో ముంపుకు గురవుతున్న గిరిజనులకు అనూకులమా లేక వ్యతిరేకమా అనేది స్పష్టం చేయాలన్నారు. కాంగ్రెస్కు అనుకూలంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయటం కూడా ఓట్ ఫర్ బెయిలులో భాగంగా జరిగిందన్నారు.