విజయానికి ఆరు సూత్రాలు
` కాంగ్రెస్ కొత్త ఫార్ములా
` హస్తానికి అధికారం ఇవ్వండి
` తెలంగాణ విజయభేరి సభలో సోనియా గాంధీ
` మోదీ, కేసీఆర్ మధ్య లోపాయికారీ ఒప్పందం: ఖర్గే
` హవిూలు ఇస్తున్నాం.. అమలు చేసి తీరుతాం: రాహుల్ గాంధీ
(కాంగ్రెస్ ప్రకటించిన ఆరు వాగ్దానాలివే..
1.మహాలక్ష్మి పథకం:మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2,500,పేద మహిళలకు కేవలం రూ.500కే వంట గ్యాస్ సిలిండర్,ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
2. రైతు భరోసా..:ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు,వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు,వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్
3. ఇందిరమ్మ ఇళ్ల పథకం:ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు.తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం
4. గృహజ్యోతి పథకం: గృహజ్యోతి పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
5. చేయూత పథకం: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా
చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్
6. యువ వికాసం: యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం.
రంగారెడ్డి(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, అన్ని వర్గాలకు మేలు జరిగేలా చేయాలనేదే తన స్వప్నం అని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో నిర్వహించిన తెలంగాణ విజయభేరి సభలో సోనియా గాంధీ పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణను తామే ఇచ్చామని, ఇకపై రాష్టాన్న్రి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తామని సోనియా మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ కొన్ని గ్యాంరటీలను ప్రకటించారు. ఈ గ్యారంటీ స్కీంలు ప్రకటించడం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని అన్నారు. మరికొందరు నేతలు మరిన్ని గ్యారంటీ స్కీమ్‌లను ప్రకటించారు. మహాలక్ష్మీ పథకం కింద పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం ఇస్తామని సోనియా గాంధీ ప్రకటించారు. ఇంటి అవసరాల కోసం రూ.500 కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అందరికీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నారు. రాజీవ్ యువ వికాసంలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. అంబేద్కర్ అభయ హస్తం పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ఏకకాలంలో రెండు లక్షల వరకూ రైతు రుణాలను మాఫీ చేస్తామని హావిూ ఇచ్చారు. ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ.5 లక్షల సాయం,ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలం కేటాయింపు చేస్తామన్నారు. రైతుభరోసా పథకం కింద రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం. వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చేలా ప్రణాళిక చేస్తామని అన్నారు. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఫ్యామిలీలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వినియోగించుకొనే వెసులుబాటు విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. చేయూత పథకం కింద నెలకు వయసు పైబడిన వారికి రూ. 4 వేల చొప్పున పింఛను అందే ఏర్పాటు,రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా వచ్చేలా ప్రణాళిక ప్రకటించారు.రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలో ఆ పార్టీ ఆరు గ్యారెంటీ హావిూలను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ హావిూలను ప్రకటించారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా దూసుకెళ్తున్న కాంగ్రెస్ మహిళా ఓటర్లే మెయిన్ టార్గెట్ గా మెజారిటీ హావిూలు ప్రకటించినట్లు తెలుస్తోంది.
మోదీ, కేసీఆర్ మధ్య లోపాయికారీ ఒప్పందం: ఖర్గే
భాజపా, భారాస రెండూ జూటా పార్టీలేనని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘’ఆ రెండు పార్టీలు తిట్టుకున్నట్టు నటిస్తూ ఒకరికొకరు సహకరించుకుంటారు. భాజపాకు భారాస బీ టీమ్‌గా మారింది. పైకి విమర్శలు చేసుకునే మోదీ, కేసీఆర్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంది. నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోదీ చక్కగా అబద్ధాలు చెప్పారు. పదేళ్లుగా దేశంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రధానులు ఎన్నో భారీ సంస్థలు నెలకొల్పారు. కాంగ్రెస్ నెలకొల్పిన సంస్థలను భాజపా సర్కారు అమ్ముకుంటూ వస్తోంది. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారు’’ అని ఖర్గే విమర్శించారు.
హవిూలు ఇస్తున్నాం.. అమలు చేసి తీరుతాం: రాహుల్ గాంధీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఎలా ఇచ్చిందో.. అదే విధంగా రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఆరు వాగ్ధాలను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు అవినీతో కూరుకు పోయిందని విమర్శించారు. పార్లమెంట్‌లో అన్ని బిల్లులకు భారాస మద్దతు ఇచ్చిందన్నారు.
భారాస సర్కారును గద్దె దించడం ఖాయం
’’ మోదీ కనుసైగ చేయగానే భారాస, ఎంఐఎం మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్ సభకు ఆటంకం కలిగించేందుకు భారాస, భాజపా,ఎంఐఎం యత్నించాయి. తెలంగాణలో భారాస, భాజపా, ఎంఐఎంతో పోరాటం చేస్తున్నాం. భారాస, భాజపా, ఎంఐఎం పైకి విడిగా కనిపిస్తున్నా.. అంతా ఒక్కటే. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కేవలం ఒక్క కుటుంబం కోసమే తెలంగాణ ఇవ్వలేదు. రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలం అంతా కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తోంది. వంద రోజుల్లో భారాస సర్కారును గద్దె దించడం ఖాయం. తొమ్మిదేళ్ల భారాస పాలనలో పేదలకు ఎలాంటి మేలు జరగలేదు. ఆరు గ్యారంటీలు ఇస్తున్నాం.. అధికారంలోకి రాగానే అమలు చేస్తాం’’ అని ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలం…
’’తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇల్లు ఇస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం.
మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌ను రూ.వెయ్యి చేసింది. మేం అధికారంలోకి రాగానే పేదలకు రూ.500లకే ఇస్తాం. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. అలాగే తెలంగాణలో కూడా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. యువ వికాసం కింద యువతకు కాలేజీ, కోచింగ్ ఫీజు కోసం రూ.5లక్షల వరకు ఇస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10లక్షల బీమా సదుపాయం. రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు రూ.15వేలు ఇస్తాం. చేయూత పింఛను ద్వారా రూ.4వేలు ఇస్తాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున ఇస్తాం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసిన రోజే హావిూల అమలుకు శ్రీకారం చుట్టారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. ధరణి పోర్టల్ ద్వారా భూములు లాక్కున్నారు. రైతు బంధు వల్ల పెద్ద రైతులకే మేలు జరిగింది. తెలంగాణలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఉన్నట్టే దేశంలో మోదీ పాలన ఉంది’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు
తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక వాగ్దానాలు ప్రకటించింది. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని వెల్లడిరచింది.రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సభలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలిసి వేర్వేరుగా ఒక్కో హావిూని ఇచ్చారు. చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలకు ఈ 6 గ్యారంటీలు ఇస్తున్నామని తెలిపారు.