విజయానికి చేరువలో బెడైన్‌

– ఓటమి అంచుల్లో అధ్యక్షుడు ట్రంప్‌

– 28 ఏళ్ల తరవాత రెండోసారి ఓడిపోతున్న అధ్యక్షుడు

– కౌంటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ

– అనుకూల వ్యతిరేక వర్గాల ఆందోళన

– మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువలో బైడెన్‌

– 214 దగ్గరే ఆగిపోయిన ట్రంప్‌

– బిడెన్‌ ముందజలో భారతీయుల తోడ్పాటు

– కోర్టెకెక్కిన ట్రంప్‌

– ఫలితాల సరళిపై సర్వత్రా ఉత్కంఠ

– ట్రంప్‌ తెంపరితనమే కొంప ముంచింది

– ఓటమికి సవాలక్ష కారణాలంటున్న అమెరికన్లు

వాషింగ్టన్‌,నవంబరు 5 (జనంసాక్షి): రెండోసారి అధ్యక్ష పదవి కోసం పోటీపడిన రిపబ్లికన్‌నేత, అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికా ప్రజల్లో ఓ విలక్షణ వ్యక్తిగా నిలిచిపోతారు. ఓడిపోయే సందర్భం వచ్చినా.. ట్రంప్‌ తన శైలితో అమెరికా ప్రజల్ని ఆకట్టుకున్న తీరు విశిష్టమైనదే. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నిల్లో ఇంకా విజేత ఎవరో తేలలేదు. ట్రంప్‌ మాత్రం ఓటమి అంచుల్లో ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో ట్రంప్‌ ఓడినా.. గెలిచినా.. ఆయన మాత్రం అమెరికా చరిత్రలో ఓ విధ్వంసకర నేతగా గుర్తుండిపోనున్నారు. ఓ దేశాధ్యక్షుడు తన రెండవ పోటీలో ఓటమి చవిచూసే సందర్భంగా దాదాపు 28 ఏళ్ల తర్వాత ఏర్పడనున్నది. ఒకవేళ ట్రంప్‌ ఓడినా.. ఆయనేవిూ దాన్ని ఈజీగా తీసుకునే వ్యక్తి కాదు. బైడెన్‌ టీమ్‌ ఓటింగ్‌ ఫ్రాడ్‌కు పాల్పడినట్లు ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. కీలకమైన రాష్ట్రాల్లో ఇంకా కౌంటింగ్‌ కొనసాగుతున్నా.. మళ్లీ ఆ రాష్ట్రాల్లో రీ-ఎలక్షన్‌ నిర్వహించే మార్గాన్వేషణలో ట్రంప్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఓటమిని అంత సులువుగా అంగీకరించే వ్యక్తిలా ట్రంప్‌ లేరన్న విషయం అర్థమవుతున్నది. తన ఓటమికి కారణమైన వారిపై చర్యలు తీసుకునేందుకు ట్రంప్‌ వద్ద మరో 76 రోజుల సమయం ఉన్నది. ఎఫ్‌బీఐ డైరక్టర్‌ క్రిస్టోఫర్‌ వ్రే, అంటువ్యాదుల నిపుణనుడు డాక్టర్‌ ఆంధోనీ ఫౌసీలను కావాలనుకుంటే ట్రంప్‌ ఏమైనా చేయగలరు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు 6.8 కోట్లకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఇది 2016 కన్నా 50 లక్షలు ఎక్కవే. పాపులర్‌ ఓటులో 48 శాతం ఓట్లను ఆయన గెలుచుకున్నారు. అంటే దాదాపు సగం జనాభాను ఆయన ఆకర్షించగలిగారు. తమ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు ఉన్నా.. ఆ స్థాయిలో ఓటర్లను ఆకర్షించడం అసాధారణమే. వన్‌ టర్మ్‌ అధ్యక్షులుగా చేసిన జివ్మిూ కార్టర్‌, సీనియర్‌ జార్జ్‌ బుష్‌ల కన్నా.. ట్రంప్‌ భిన్నమైన వ్యక్తి. రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌ కింగ్‌మేకర్‌గా ఎదిగే ఛాన్సు ఉంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన స్పష్టమైన సందేశం.. ఆయనకు ఉన్న ప్రజాభిమానం. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ట్రంప్‌కు ఎక్కువగానే ఉన్నట్లు ఓటింగ్‌ శాతం బట్టి తేలిసిపోతున్నది. ఏ దశలోనూ పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదన్న సంకేతాన్ని ట్రంప్‌ ఇచ్చారు. రిపబ్లికన్‌ ఓటర్లలో 93 శాతం ఓట్లను ట్రంప్‌ గెలుచుకున్నారు. రిపబ్లికన్‌ పార్టీలో ఆయనో హీరో. 2024 ప్రెసిడెన్షియల్‌ ప్రైమరీలో ట్రంప్‌ గెలిచినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలను రిపబ్లికన్‌ నేతలు వినిపిస్తున్నారు. అయితే గతంలో ఓడిన రాష్ట్రాల నుంచి ఒక్క రాష్ట్రాన్ని కూడా ట్రంప్‌ గెలవలేకపోయారు. ఇది ట్రంప్‌ ఓటమిలో పెద్ద మైనస్‌గా మారనున్నది. 1976లో గెరాల్డ్‌ ఫోర్డ్‌, 1980లో కార్టర్‌, 1992లో బుష్‌లు ఒకే టర్మ్‌ చేసి ఓడిపోయారు. కానీ వాళ్లు రెండవ టర్మ్‌ కోసం పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక ట్రంప్‌ ఆ దృష్టి సారిస్తారో లేదో ఇప్పుడే చెప్పలేం. కానీ అమెరికా ఆధునిక చరిత్రలో ట్రంప్‌ ఓ విభిన్న రాజకీయవేత్తగా నిలువనున్నారు.

కౌంటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌, బైడెన్‌ మధ్య ఫలితం ఇంకా తేలకపోవడంతో.. ఆ దేశంలోని పలు నగరాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కౌంటింగ్‌ను ఆపేయాలంటూ ట్రంప్‌ పిలుపునివ్వగా.. దాన్ని వ్యతిరేకిస్తూ బైడెన్‌ మద్దతుదారులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్‌లో మోసం జరుగుతోందని, తక్షణమే కౌంటింగ్‌ నిలిపివేయాలని

ట్రంప్‌ పిలుపునిచ్చారు. దీంతో ట్రంప్‌ అనుకూల వర్గీయులు.. పోలింగ్‌ బూతల వద్ద భారీ నిరసన ప్రదర్శనలకు దిగారు. ఇక ట్రంప్‌కు వ్యతిరేకంగా కొన్ని నగరాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. పోలైన అన్ని ఓట్లను లెక్కించాలని బైడెన్‌ మద్దతుదారులు నినాదాలు చేస్తున్నారు. కొన్ని కీలక రాష్టాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తింది. ఓరేగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో ట్రంప్‌ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. అయితే హింసాత్మకంగా మారకుండే ఉండేందుకు జాతీయ గార్డులను రంగంలోకి దించారు. సిటీ సెంటర్‌లో షాపులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. మిన్నియాపోలీస్‌లో నిరసనకారులను అరెస్టు చేశారు. కౌంటింగ్‌ ఆపేయాలని చెప్పిన ట్రంప్‌కు వ్యతిరేకంగా వాళ్లు ప్రదర్శన చేపట్టారు. న్యూయార్క్‌, ఫిలడెల్ఫియా, చికాగో నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు ¬రెత్తించాయి. ఇక డెట్రాయిట్‌లో ట్రంప్‌ అనుకూల వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఆరిజోనాలోని ఫినిక్స్‌ లో కూడా కౌంటింగ్‌ ఆపాలంటూ ప్రదర్శన నిర్వహించారు.

మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువలో బైడెన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠను సృష్టిస్తున్నాయి. డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ ప్రెసిడెంట్‌ కావడానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 270కి కేవలం 6 ఎలక్టోరల్‌ ఓట్లకు దూరంలో ఉన్నారు. అటు రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌ 214 ఎలక్టోరల్‌ ఓట్ల దగ్గరే ఆగిపోయారు. ఆయన మరోసారి అధ్యక్షుడు కావాలంటే ఇంకా 56 ఎలక్టోరల్‌ ఓట్లు గెలవాలి. ఇంకా ఐదు రాష్ట్రాలఫలితాలు వెలువడాల్సి ఉంది. కానీ, ఫలితాల్లో వెనుకంజలో ఉన్న ట్రంప్‌ తాజాగా అన్నంత పని చేశారు. అధ్యక్షుడు ట్రంప్‌ మొదటి నుంచి ఆరోపిస్తున్నట్లు మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్ల ఓట్ల విషయమై న్యాయస్థానం మెట్లు ఎక్కారు. ముఖ్యంగా పెన్సిల్వేనియా (20), మిచిగాన్‌ (16), జార్జియా (16) రాష్ట్రాల్లో బైడెన్‌ ఆధిక్యం పొందడంతో ఆయన ఈ ప్రాంతాల్లో కౌంటింగ్‌ను వెంటనే ఆపాలని అక్కడి స్థానిక కోర్టుల్లో దావా వేశారు. పెన్సిల్వేనియా, మిచిగాన్‌లలో కౌంటింగ్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్న ట్రంప్‌ బృందం అక్కడి కోర్టుల్లో దావా వేసింది. అలాగే కౌంటింగ్‌ను పర్యవేక్షించేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదని మరో దావా వేస్తామంటూ ట్రంప్‌ వ్యక్తిగత న్యాయవాది ర్యూడీ గైలైనీ విూడియాతో మాట్లాడుతూ అన్నారు. మరోవైపు బైడెన్‌ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ కౌంటింగ్‌ను ఆపే ప్రసక్తే లేదని చెబుతున్నారు. మిగిలిన రాష్టాల్లో కూడా యధావిధిగా కౌంటింగ్‌ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక మిచిగాన్‌లో బిడెన్‌ ఇప్పటికే గెలిచారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ట్రంప్‌, బైడెన్‌ మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగానే ఉంది. కాగా, పోస్టల్‌ బ్యాలెట్‌ ముగింపు తేదీపై సుప్రీంకోర్టులో ఇప్పటికే ఉన్న కేసులో తమను ప్రతివాదిగా చేర్చాలని కోరేందుకు ట్రంప్‌ టీం ప్రయత్నిస్తోంది. దీనికోసం మోషన్‌ పిటిషన్‌ వేసేందుకు కూడా రెడీ అయింది.

ట్రంప్‌ తెంపరితనమే కొంప ముంచింది

ఆమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ ¬రా ¬రీగా జరుగుతుంది.. ట్రంప్‌-బిడైన్‌ మధ్య కౌంటింగ్‌ అభ్యర్థులకు టెన్షన్‌ పుట్టిస్తున్నాయి..క్షణం క్షణం ఫలితాల సరళి మారుతుంది..ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే బిడైన్‌ వైట్‌ హౌస్‌ చేరడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నట్లు తెలుస్తుంది..ట్రంప్‌కు 214 ఎలక్టోరల్‌ ఓట్లు రాగా..బిడెన్‌కు మెజార్టీ దగ్గరగా 264 వచ్చాయి..ఇంకా ఆరు రాష్ట్రాల్లో కౌంటింగ్‌ కొనసాగుతుంది..వాటిలో కూడా బిడెన్‌ అధిక్యంలో ఉన్నట్లు అంతర్జాతీయ విూడియా పేర్కోంటుంది..కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లు ట్రంప్‌ ఓటమికి సవాలక్ష కారణాలు ఉన్నాయి..ట్రంప్‌ తెంపరితనం గురించి నాలుగేళ్ళుగా అందరికీ తెలిసిందే. ట్రంప్‌ వ్యవహార శైలి. ఆయన బాడీ లాంగ్వేజ్‌ ఇవన్నీ కూడా అంతర్జాతీయ సమాజం చూసి ఎప్పటికపుడు ఒక రకమైన అంచనాకు వస్తూనే ఉంది. ఇపుడు ట్రంప్‌ చాలా తీవ్రమైన ఫ్రస్టేష్రన్‌ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది లేకపోతే ముంగిట్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు పెట్టుకుని ఆయన భారతదేశం గురించి చాలా దారుణంగా మాట్లాడాడు..భారత్‌ ప్రజల ఇగోని హర్ట్‌ చేసేలా ట్రంప్‌ వాడిన ఒకే ఒక్క మాట ఆయన జాతకం మొత్తం మార్చేసేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు.. భారత్‌ని గతంలో చాలా సార్లు ట్రంప్‌ విమర్శించినా కూడా తాజాగా ఆయన మాటలు మాత్రం దారుణమనే చెప్పాలి. కరోనా వైరస్‌ వ్యాప్తిపై చివరి వరకూ చైనాను విమర్శించిన ట్రంప్‌.. అధ్యక్ష అభ్యర్థుల మధ్య చాలా ప్రతిష్టాత్మంగా నిర్వహించే డిబేట్‌లో భారత్‌ కూడా కరోనా వ్యాప్తి విషయంలో అబద్దాలు చేపుతుందని దారుణ వ్యాఖ్యలు చేశారు..కరోనా లెక్కలు చెప్పడంలో భారత్‌ ప్రపంచాన్ని మోసం చేస్తోందని కూడా ట్రంప్‌ ఆరోపించారు..అంతే కాకుండా..భారత్‌ చైనా, రష్యాలతో కలిపి ఒకే గాటన కట్టిన ట్రంప్‌ ఈ దేశాలనీ పర్యావరణానికి తీరని హాని చేస్తున్నాయని నిందించారు..భారత్‌ మురికి దేశం అంటూ నోరు పారేసుకున్న ట్రంప్‌..దీంతో ప్రవాస భారతీయుల నుంచి ట్రంప్‌ ఆశించిన స్థాయిలో ఓట్లును పొందలేరని..తన గొయ్యి తానే తీసుకున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..ఇక వెనక్కి తిరిగి చూసుకునేందుకు కూడా ఆయన ఏవిూ ఆశలు మిగుల్చుకోలేదని కూడా అంటున్నారు. ఇక ట్రంప్‌ పని అయిపోయిందని అంతర్జాతీయ విశ్లేషకులు కూడా తేల్చేస్తున్నారు.