విజయ్‌మాల్యా పాస్‌పోర్ట్‌ రద్దు

న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన పాస్‌పోర్టును ప్రభుత్వం రద్దు చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్విటర్‌ ద్వారా ఈ విషయం వెల్లడించింది. షోకాజ్ నోటీసుకు విజయ్ మాల్యా ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించామని పేర్కొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించిన అంశాలు, ముంబై స్పెషల్ జడ్జి పీఎంఎల్ఏ చట్టం, 2002 ప్రకారం జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారంట్‌లను దృష్టిలో ఉంచుకుని విజయ్ మాల్యా పాస్‌పోర్టును పాస్‌పోర్టుల చట్టం, 1967 సెక్షన్ 10(3)(సి), సెక్షన్ 10(3)(హెచ్) ప్రకారం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాస్‌పోర్టు రద్దు కావడంతో విజయ్ మాల్యాకు మరో దారిలేదు, తప్పనిసరిగా భారతదేశానికి తిరిగి రావాల్సిందే.MALYA_53a