విజయ్ మాల్యాకు 4 నెలల జైలు
2వేల జరిమానా విధించిన సుప్రీం
న్యూఢల్లీి,జూలై11(జనం సాక్షి ):లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది.
కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు 4 నెలల జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధించినట్లు సుప్రీంకోర్టు వెల్లడిరచింది. 2017లో కర్ణాటక హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి.. విదేశాల్లో ఉన్న తన కుమారుడు సిద్దార్థ్ మాల్యా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్యా మాల్యాలకు 40 మిలియన్ డాలర్లను ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి మాల్యా బదిలీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ చేశారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నాలుగు వారాల్లోగా వడ్డీతో సహా నగదు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు మాల్యాను ఆదేశించింది. డిపాజిట్ చేయకుంటే ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని కోర్టు స్పష్టం చేశారు. మాల్యా ప్రస్తుతం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన రూ. 9,000 కోట్లకు పైగా బ్యాంకు రుణ ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్నారు.