‘విజయ పాలతో ఆరోగ్యవంతమైన జీవనం’
రంగారెడ్డి, జూలై 30 : విజయ డైరీ వారి నాణ్యమైన పాల ఉత్పత్తుల వలన ఆరోగ్యవంతమైన జీవనం పొందుతామని రంగారెడ్డి జిల్లా కలెక్టరు వి.శేషాద్రి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో విజయ డైరీ పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ఎ.పి. డైరీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మహ్మద్ రఫ్‌త్‌అలీతో కలసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ విజయడైరీ పాల ఉత్పత్తుల విక్రయకేంద్రాన్ని కలక్టరేట్ ఆవరణలో ప్రారంభించడం సంతోషదాయకమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మహ్మద్ రఫత్ అలీ మాట్లాడుతూ విజయ పాల ఉత్పత్తులను కొనుగోలు చేసి పాడి పరిశ్రమ అభివృద్దికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.పి.డైరీ జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, శ్రీ వెంకటేశ్వర పుడ్ అండ్ బివరేజేస్ డి స్ట్రిబ్యూటర్ పాలడుగు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు