విడిపోయిన బంధం
లండన్,జూన్ 24(జనంసాక్షి): యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ ప్రజలు తీర్పునిచ్చారు. ఈ నిర్ణ యంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు షేక్ అయ్యాయి. భార త్ స్టాక్ మార్కట్లు కుదేలయ్యాయి. బంగారం,వెండి ధరలు అనూ హ్యంగా పెరిగాయి. ఇకపోతే బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోనందుకు గాను ప్రధాని పదవి నుంచి తప్పుకోబోతున్నట్లు బ్రిటన్ ప్రధాని కామెరూన్ ప్రకటించారు. మొత్తానికి తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. బ్రెగ్జిట్‌పై సందేహాలకు స్పష్టత వచ్చేసింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడమనేది ఎట్టకేలకు ఖాయమైంది. నాలుగు దశాబ్దాలుగా ఐరోపా సమాఖ్యతో కలిసి ఉన్న బ్రిటన్.. ఇప్పుడు వేరుకుంపటికి సిద్ధమైంది. గురువారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఉన్నామంటూ 51.8 శాతం మంది, వ్యతిరేకంగా 48.2 శాతం ప్రజలు మద్దతు ప్రకటించారు. దీంతో బ్రిటన్ వేరుపడటం ఖాయమైంది. ఈ పరిణామం ప్రపంచ దేశాల తో పాటు బ్రిటన్ విూద ప్రభావాన్ని చూపిస్తుందన్న నేపథ్యాన్ని బ్రిటీషర్లు పట్టించుకోకపోవటం గమనార్హం. శుక్రవారం వెలు వడిన ఫలితాల్ని చూస్తే యూరోపియన్ యూనియన్ నుంచి బయ టకు వచ్చే విషయంలో స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణలో వెలువ డిన ఫలితాల ప్రకారం.. సమాఖ్య నుంచి బ్రిటన్ విడిపోవాల నుకునే వారి సంఖ్య 1,74,10,742గా ఉండగా.. కూటమితో కలిసుందామనుకునే వారి సంఖ్య 1,61,41,241గా ఉంది. బ్రెగ్జిట్‌వైపే ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో.. బ్రిటన్ వేరుప డటం స్పష్టమైంది. 12.69లక్షల మంది నిర్ణయం బ్రెగ్జిట్ ను నిర్ణయించింది. ఈ చారిత్రక రెఫరెండమ్‌లో మూడు కోట్లకు పైగా ఓటర్లు పాల్గొన్నారు. మ్యాజిక్ ఫిగర్ కోటి 68 లక్షల ఓట్లను బ్రెగ్జి ట్ సునాయాసంగా దాటేసింది. తొలి ఫలితం నుంచి చివరి దాకా విడిపోవడానికే యూకే ప్రజలు మొగ్గు చూపినట్లు స్పష్టంగా కని పించింది. యూకే ఇండిపెండెన్స్ పార్టీ లీడర్ నిగెల్ ఫారేజ్ దీనిని బ్రిటన్ స్వతంత్ర దినంగా అభివర్ణించారు. యూకే యురోపిన్ యూనియన్ నుంచి విడిపోవాలని ఆయన 20 ఏళ్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇది సామాన్యుల విజయం అని ఆయన తుది ఫలి తాల తర్వాత వ్యాఖ్యానించారు. చరిత్రలో జూన్ 23 బ్రిటన్ ఇం డిపెండెన్స్ డేగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. ఈయూలోనే ఉండాలని ప్రచారం చేసిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చే శారు. యురోపియన్ యూనియన్ నుంచి వైదొలగబోయే తొలి దేశంగా బ్రిటన్ నిలవబోతోంది. అయితే ఇప్పటికిప్పుడే బ్రిటన్ ఈ యూ నుంచి తప్పుకున్నట్లు కాదు. ఈ ప్రాసెస్‌కు కనీసం రెండ ేళ్లయినా పడుతుంది. ప్రధాని కామెరాన్ లిస్బన్ ఒప్పందంలోని ఆర్టికల్ 50ని ఎప్పుడు ప్రయోగించాలో నిర్ణయం తీసుకోను న్నారు. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటన్ మళ్లీ ఎప్పుడైనా కలవాల నుకుంటే అన్ని సభ్య దేశాల అంగీకారం అవసరమవుతుంది. ఒకవేళ బ్రిటన్ విడిపోవాలని ఓటేస్తే తాను ఆర్టికల్ 50ని ప్రయో గిస్తానని కామెరాన్ ముందే ప్రకటించారు. ఇయూ కూటమి నుం చి బ్రిటన్ విడిపోవాలంటూ కొంతకాలంగా వాదనలు వెల్లువె త్తాయి. దీంతో ఈ అంశంపై గురువారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. గ్రేట్ బ్రిటన్ అంటే.. ఇంగ్లండ్, వేల్స్, స్కాట్‌లాండ్, నా ర్త్ ఐర్లాండ్ సమూహం. వీటిలోని మొత్తం 382 కేంద్రాల్లో అ భిప్రాయ సేకరణ జరిగింది. భారత కాలమానం ప్రకారం.. గురు వారం అర్ధరాత్రి నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి దశలో బ్రిటన్ కూటమి నుంచి బయటకు రావాలన్న అభిప్రా యాన్ని వ్యక్తం చేసినా.. అధిక్యత చాలా స్వల్పంగా ఉంది. ఒకదశలో కూటమిలో కొనసాగే దిశగా ఓటింగ్ సరళి కని పించింది. అయితే.. భారత కాలమానం ప్రకారం శుక్రవా రం ఉదయం 9 గంటలకు ఫలితాల సరళిపై స్పష్టత వచ్చిం ది. అప్పటివరకూ కూటమిలో ఉండాలనుకునే వారికి.. వైదొలగాలని కోరుకునే వారికి మధ్యనున్న వేల ఓట్ల వ్యత్యాసం లక్షలకు చేరుకుంది.బ్రిటన్‌లోని నాలుగు ప్రాం తాల్లో వెలువడిన ఫలితాల్లో బ్రెగ్జిట్‌లో ఆసక్తి కోణమిది. ఇం గ్లండ్, వేల్స్ ప్రాంతాల్లోని ఎక్కువ మంది యూరో సమాఖ్య నుంచి వైదొలిగేందుకు మొగ్గు చూపగా.. స్కాట్లాండ్, నార్త్ ఐ ర్లాండ్‌లోని ఓటర్లు మాత్రం కూటమిలో ఉండేందుకే మొగ్గు చూపారు. స్కాట్లాండ్, నార్త్‌ఐర్లాండ్‌లో ప్రజలు కలిసుందాం అని అనుకున్నా.. ఇంగ్లండ్ ఓటర్ల ప్రభావంతో బ్రెగ్జిట్ ఖ రారైంది. ఇంగ్లండ్‌లో భారీగా ప్రజలు సమాఖ్య నుంచి వైదొలగడం వైపే మొగ్గు చూపారు. ఇంగ్లండ్‌లోని ఓటర్ల మధ్య ఉండాలి, వెళ్లిపోవాలి అన్న దగ్గర ఇరు వర్గాల మధ్య వ్యత్యాసం దాదాపు 30 లక్షల వరకూ రావటం గమనార్హం. ఇదే.. తుది ఫలితాన్ని ప్రభావితం చేసింది. నార్త్ ఐర్లాండ్, స్కాట్లాండ్‌లో సమాఖ్యతో బ్రిటన్ కలిసుండాల నుకునే వారి ఆధిక్యం 7,33,864గా ఉంది. అయితే ఇంగ్లండ్, వేల్స్‌లో మాత్రంవైదొలగడంపై మొగ్గుచూపారు. ఈ ప్రాంతాల్లో బ్రెగ్జిట్ ఆధిక్యం20,03,635. ప్రజల తీ ర్పుతో యురోపియన్ యూనియన్‌తో 43 ఏళ్ల బంధాన్ని తెంచుకోబోతోంది యునైటెడ్ కింగ్‌డమ్. చారిత్రక రెఫరెం డమ్‌లో బ్రిటన్ ప్రజలు విడిపోవడానికే పట్టం కట్టారు. 51.9 శాతం మంది ఈయూని వీడాలని ఓటేయగా, 48.1 శాతం మంది కలిసుండటానికి మద్దతు తెలిపారు. ఫలితాలు స్పష్టం కావడంతో పౌండ్ విలువ భారీగా పతనమైంది. తొలి ఫలితాలు వెలువడిన వెంటనే పౌండ్ విలువ డాలర్‌తో 3 శాతం, యూరోతో 6.5 శాతం పతనమవడం మొదలైంది. దీంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కలుగజేసుకోవాల్సి వచ్చింది. 1985 తర్వాత అమెరికన్ డాలర్‌తో పోలిస్తే పౌండ్ విలువ కనిష్ఠానికి చేరింది. బ్రెగ్జిట్ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తీవ్రంగా ఉంది. సెన్సెక్స్ ఓ దశలో వెయ్యికిపైగా పాయింట్లు నష్టపోయింది.
బ్రెగ్జిట్ ఫలితాలతో కామెరూన్ కలత
బ్రెగ్జిట్ పై బ్రిటన్ ప్రజల నిర్ణయం ప్రధాని డేవిడ్ కామెరాన్ పదవికి ఎసరు తెచ్చిపెట్టింది. యూరోపియన్ యూనిన్ లోనే బ్రిటన్ కొనసాగాలన్న ఆయన ఆకాంక్షకు వ్యతిరేకంగా ప్రజ లు తీర్పు ఇవ్వడంతో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. బ్రెగ్జిట్ పై ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని చెప్పారు. తాను నమ్మిన కోసమే పోరాడానని చెప్పారు. బ్రిట న్ ప్రజలు యురోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికే మొగ్గు చూపడంతో ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రెగ్జిట్ తుది ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని ఆయన గట్టిగా ప్రచారం చేశారు. కానీ మెజార్టీ ప్రజలు ఆయన ఆకాంక్షకు వ్యతిరేకంగా ఓటేశారు. బ్రిటన్ ప్రజల తీర్పును తాను శిరసా వహిస్తున్నానని కామెరాన్ ప్రకటించారు. దీంతో అక్టోబర్‌లోగా రాజీనామా చేస్తానని, దేశానికి కొత్త నా యక్తంవ అవసరమని గుర్తించానని అన్నారు. ఈ ఫలి తాలను తేలిగ్గా తీసుకోవడం లేదని అన్నారు. పదవి నుంచి వైదొలిగినా బ్రిటన్ ఒంటరిగా నిలదొక్కుకోవడానికి అవసర మైన అన్ని సహాయసహకారాలు అందిస్తానని ఆయన చెప్పా రు. ఇంతకాలం ప్రధానిగా పనిచేసినందుకు గర్వంగా ఉంద ని కామెరాన్ అన్నారు. ఈయూతో మళ్లీ సంప్రదింపుల కో సం ఉద్దేశించిన లిస్బన్ ఒప్పందంలోని ఆర్టికల్ 50ని తాను ప్రయోగించబోనని, కొత్త ప్రధానే ఆ పని చేస్తారని స్పష్టం చేశారు. అక్టోబర్‌లో కన్జర్వేటివ్ పార్టీ కాన్ఫరెన్స్ మొద లయ్యేలోపు కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టేలా చూస్తామని ఆయన అన్నారు. ఈయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బ్రిటన్ సొంతంగా నిలదొక్కుకోగలదన్న నమ్మకం తన కుందని కామెరాన్ చెప్పారు. దేశానికి కొత్త నాయకత్వం అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అక్టోబర్ లో కొత్త ప్రధా ని వస్తారని సంచలన ప్రకటన చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవని భావి స్తున్నట్టు చెప్పారు. యూకే ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయన్నారు. మొదటి నుంచి బ్రెగ్జిట్ ను వ్యతిరేకించిన ఆయన ప్రజాతీర్పుతో కంగుతిన్నారు. తన ఆకాంక్షకు వ్య తిరేకంగా ఫలితం రావడంతో ప్రధాని పదవిని వదులు కోవా లని నిర్ణయించారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన కామెరాన్ 2010లో తొలిసారిగా ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 2015లో రెండో పర్యాయం ప్రధానిగా ఎన్నికయ్యారు. బ్రెగ్జిట్ తీర్పుతో మరో నాలుగేళ్లు పదవీ కాలం ఉండగానే రాజీనామా ప్రకటన చేశారు.
భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిన బ్రెగ్జిట్ ఫలితాలు
బెగ్జిట్ ఫలితాలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపా యి. బ్రెగ్జిట్ దెబ్బతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రూపాయి విలువ భారీగా పతనమైంది. బంగారం, వెండి ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. అయితే నిలదొక్కునే సామర్థ్యం భారత్‌కు ఉందని ఆర్థికవేత్తలు ప్రకటించగా , ఈ ప్రభావాన్ని తట్టుకుంటామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రక టించారు. శుక్రవారం
ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచే స్టాక్‌మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. తొలుత 900 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.. ఆ తర్వాత కాస్త కుదురుకుని 750 నష్టంలో ట్రేడ్‌అయింది. అయితే బ్రిటన్ విడిపోవడంపై ఆధిక్యం పెరగడంతో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. అటు నిఫ్టీ కూడా 300 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రెండేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. 83 పైసలకు పడిపోయి 68.07 వద్ద కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. శుక్రవారం బులియన్ మార్కెట్ ప్రారంభమైన తర్వాత బంగారం ధర రూ.1700 పెరిగి రూ.31, 600 వద్ద
కొనసాగుతోంది. వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. రూ.1300 పెరిగి రూ.42,500 వద్ద కొనసాగుతోంది. బ్రెగ్జిట్ ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 1900కు పైగా పెరగగా కిలో వెండి ధర రూ. 1500కు పైగా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 31,741గా ఉండగా కిలో వెండి ధర రూ. 42,500గా ఉంది. బ్రెగ్జిట్ ప్రభావం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనౌతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడిని సురక్షితంగా భావిస్తుండటంతో ధరల పెరుగుదల నమోదైతుంది. విశ్లేషకుల అంచనా వేసినట్టుగానే ‘బ్రెగ్జిట్’ ప్రభావంతో ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా పతమవుతున్నాయి. బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగడానికి రెఫరెండం అనుకూలంగా ఉందన్న వార్తలతో దాదాపు గ్లోబల్ మార్కెట్లన్నీ కుదేలైనాయి. ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల పైగా కోల్పోగా, నిఫ్టీ ఎనిమిదివేలకు దిగువన ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న వార్తల ప్రభావంతో అటు వివిధ కరెన్సీ మార్కెట్లపై నెగెటివ్ గా ఉండగా … బులియన్ మార్కెట్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిన్న నష్టాల్లో ఊగిసలాడిన పుత్తడి ధరలు శుక్రవారం పరుగులు పెడుతూ దూసుకుపోతున్నాయి. ఒకప్పటి బూం తర్వాత మళ్లీ తొలిసారి 31 వేలను దాటి రాకెట్ లా నింగిలోకి దూసుకుపోతున్నాయి. ఆరుశాతానికి పైగా లాభపడి మూడేళ్ల గరిష్ట స్తాయికి చేరుకుంది. ఎంఎసీఎక్స్ మార్కెట్ లో పసిడి10 గ్రా. 31 రూ. లక పైన స్థిరంగా ఉంది. 1794 రూపాయలు లాభపడి 31,708 దగ్గర ట్రేడవుతూ మదుపర్లను మురిపిస్తోంది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 89 పైసలు పడిపోయింది. డాలర్ తో రూపాయి విలువ 68.11గా ఉంది.
బ్రెగ్జిట్ ఫలితాలను ఎదుర్కొంటాం: జైట్లీ
బ్రెగ్జిట్ ఫలితాలను ఎదుర్కొనేందుకు కేంద్రం అన్నివిధాలా సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. బ్రెగ్జిట్ ఫలితాల కారణంగా ఎదురవుఉతన్న ఒడిదుడుకులను అధిగమిస్తామని, ఆ సత్తా భారత్‌కు ఉందన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికే ఎక్కువ మంది బ్రిటన్ ప్రజలు మొగ్గు చూపడంతో ప్రపంచ స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. బంగారం ధరలు గత రెండేళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో బ్రెగ్జిట్‌పై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో జైట్లీ స్పందించారు. బ్రిటన్ ప్రజల తీర్పును భారత్ గౌరవిస్తోందని… మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని… ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉండటంతో ఆర్థిక సుస్థిరతకు ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ వద్ద 363 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలున్నాయి.
దక్షిణ కొరియాలోనూ బ్రెగ్జిట్ ప్రకంపనలు
ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన బ్రెగ్జిట్ ఉదంతం దక్షిణ కొరియాను కూడా కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఆర్థిక నిపుణులతో అధికారులతో చర్చలకు దిగింది. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగిన పరిణామాల ప్రభావాన్ని అంచనా వేయడానికి దేశ ఆర్ధిక, ద్రవ్య అధికారులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ సంక్షోభంపై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని నిర్వహస్తోందని యాన్ హ్యాప్ న్యూ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలగడంతో ఆ పరిణామాలను ఎదుర్కొనేందుకు… సంబంధిత చర్యలకుపక్రమిస్తోందని తెలిపింది. ఈ భారీ పతనం నుంచి తప్పించుకునే మార్గాలపై చర్చించటానికి అత్యవసర సమావేశం నిర్వహిస్తోందని నివేదించింది. కాగా బ్రెగ్జిట్ సంక్షోంతో దక్షిణ కొరియా ఆర్థిక మార్కెట్లు శుక్రవారం అతలాకుతలమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లలో చోటుచేసుకున్న భారీ పతనంతో ద.కొరియా మార్కెట్లు కూడా అల్లకల్లోలంగా ఉన్నాయని చెప్పింది.
31 ఏళ్ల కనిష్టానికి పౌండ్ విలువ
యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. దాంతోపాటు బ్రిటిష్ కరెన్సీ పౌండ్ విలువ కూడా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. గత 31 ఏళ్లలో అత్యంత దిగువ స్థాయికి పౌండ్ పడిపోయింది. 10 శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. వాస్తవానికి బ్రిటిష్ ప్రజలు యూరోపియన్ యూనియన్లో ఉండటానికే మొగ్గు చూపిస్తారని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో వెళ్లిపోవాలని ఓటు వేయడంతో మార్కెట్లు తీవ్రంగా పతనమయ్యాయి. నిన్నటి వరకు పౌండుకు 1.50 డాలర్లు వస్తే, ఇప్పుడు కేవలం 1.35 డాలర్లు మాత్రమే వస్తున్నాయి. రూపాయి విలువతో పోల్చి చూసినపుడు కూడా పౌండు విలువ పడిపోయింది. నిన్నటి వరకు సుమారుగా ఒక పౌండుకు 98-99 రూపాయల వరకు వస్తుండగా, ఇప్పుడు 91.34 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. పౌండు విలువ పడిపోవడంతో ఆ ప్రభావం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ విూద కూడా దారుణంగా ఉంటుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. బ్రిటిషర్ల నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్ల విూద కూడా గట్టిగానే కనిపించింది. భారత స్టాక్ మార్కెట్ ఓ దశలో వెయ్యి పాయింట్ల వరకు నష్టపోగా జపాన్ మార్కెట్లలో అయితే 10 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపివేశారు.
బ్రిటన్ బాటలోనే ఇతర దేశాలు
బ్రిటన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు యురోపియన్ యూనియన్ కూటమిలో తేన తుట్టెను కదిలించింది. బ్రెగ్జిట్ బాటలోనే మరికొన్ని దేశాలు కూడా ముందుకు వెళ్లాలనుకుంటున్నాయి. యురోపియన్ యూనియన్‌తో 43 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న బ్రిటన్ దారిలోనే ఫ్రాన్స్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్ దేశాలు కూడా అడుగులు వేయాలనుకుంటున్నాయి. ఆయా దేశాలకు చెందిన కొన్ని రాజకీయ పార్టీలు ఈయూతో తెగతెంపులు చేసుకునేందుకు డిమాండ్లు చేస్తున్నాయి. ఈయూ గ్రూప్‌లో ఉండాలా లేదా అన్న నిర్ణయాన్ని తీసుకునే అధికారం ఫ్రాన్స్‌కు కూడా ఉండాలని ఆ దేశ నేషనల్ ఫ్రంట్ పార్టీ లీడర్ మారిన్ లీ పెన్ అన్నారు. డచ్ దేశానికి చెందిన యాంటీ ఇమ్మిగ్రేషన్ రాజకీయవేత్త గీర్ట్ వైల్డర్స్ కూడా ఇదే నిర్ణయాన్ని వినిపించారు. నెక్సిట్ ఓటుతో ఈయూ నుంచి నెదర్లాండ్స్ తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటలీకి చెందిన నార్తర్న్ లీగ్ పార్టీ కూడా ఈయూ కూటమి నుంచి విడిపోవాలని కోరుకుంటోంది. 28 దేశాల కూటమి నుంచి బ్రిటన్ తప్పుకోవాలని నిర్ణయించడంతో ఇప్పుడా సంస్థ మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. బ్రిటన్ నిర్ణయం మొత్తం యురోపియన్ యూనియన్ సంస్థపైన ఉంటుందని ఆ కూటమికి చెందిన రాజకీయవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బ్రెగ్జిట్ నిర్ణయాన్ని ఫ్రాన్స్‌కు చెందిన లీ పెన్ స్వాగతించారు. బ్రెగ్జిట్ తీర్పు స్వేచ్ఛా సంకేతమని, ఫ్రాన్స్‌తో పాటు ఇతర సభ్య దేశాల్లోనూ ఇదే తరహా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని ఆమె అన్నారు. 2017లో ఫ్రాన్స్‌లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో లీ పెన్ దేశాధ్యక్ష పోటీ కోసం రేసులో ఉన్నారు. బ్రిటన్ కంటే ముందే ఫ్రాన్స్ ఈయూను వదిలి వెళ్లాలని ఆమె అన్నారు. నెదర్లాండ్స్ కూడా బ్రెగ్జిట్ బాట పట్టాలనుకుంటోంది. వచ్చే మార్చి నెలలో ఆ దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు విల్డర్స్ రేసులో ఉన్నారు. అతను కూడా బ్రిగ్జిట్ తరహాలో ఈయూ నుంచి డచ్‌ను తప్పించాలనుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఈయూ నుంచి నెదర్లాండ్స్ బయటపడాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మొత్తం విూద యురోపియన్ యూనియన్ ఓ రాజకీయ కూటమిగా విఫలమైందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.




