విత్ డ్రా ఫారాలు జిరాక్స్ సెంటర్‌లో కొనుక్కోవాలా…?
-చల్లూర్ ఆంద్రాబ్యాంక్‌పై వినియోగదారుల మండలి ఫిర్యాదు
కరీంనగర్, ఆగస్టు 28 :బహుశా జిల్లా చరిత్రలో మొదటి సారిగా కాబోలు ఓక బ్యాంకు తమ ఖాతాదారులకు ఉచితంగా ఇవ్వాల్సిన విత్ డ్రాలు ఫారంలను జిరాక్స్ సెంటర్‌లో కొనుక్కోవాలని అంటున్నది. చల్లూర్ ఆంద్రాబ్యాంక్ శాఖలో గత నాలుగు నెలలుగా ఖాతాదారులు, తమ డబ్బులు తీసుకోవాలంటే రెండు రూపాయలు చెల్లించి జీరాక్స్ సెంటర్‌లో ఫారం కొనుక్కుంటున్నారు. ప్రతి రోజు రెండు వందలకుపైగా దగ్గర్లోని పది గ్రామాలనుంచి వచ్చి నగదు లావాదేవీలు నిర్వహిస్తుంటారు. వృద్దులు వికలాంగులు సైతం పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు వస్తే అదే అవస్థ. స్టేషనరీ లేకుంటే ముద్రించి ఖాతాదారులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని కరీంనగర్ వినియోగదారుల మండలి భ్యాంకు జనరల్ మేనేజర్‌కు పిర్యాదు చేసింది. గ్రావిూణ ప్రాంతాల్లో ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యం కలిగించినా అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేస్తామని కరీంనగర్ వినియోగదారుల మండలి బాద్యులు ఎన్ శ్రీనివాస్, ఆర్ చందప్రభాకర్, రాంచంద్రారెడ్డి, ముజఫర్ లక్ష్మణ్‌కుమార్ ప్రకాశ్, గంగాదర్ నారాయణలు హెచ్చరించారు.