విదేశాలకెళ్లి చుదువుకునే ముస్లిం విద్యార్థులకు 10 లక్షల సాయం
జిల్లాకో బాలుర,
బాలికల హాస్టల్
తెలంగాణ ముస్లిం విద్యావంతుల
వేదిక సభలోఉపముఖ్యమంత్రి
మహమూద్ అలీ
హైదరాబాద్ జూన్ 14 (జనంసాక్షి):
ముస్లిం విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసిస్తే రూ. 10లక్షల ఆర్థిక సహాయం అందిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకుే కేబినె ట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ అన్నారు. ఆది వారంనాడు స్థానిక పబ్లిక్ గార్డెన్‌లోని మౌలనా అబుల్ కలామ్ ఆజాద్ స్మారక హాల్‌లో తెలం గాణ ముస్లిం విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో పేద ము స్లింల అభ్యన్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉం దని, రాబోయే సంవత్సరంలో తొమ్మిది లక్షల జంటలకు షాదీ ముబారక్ పథకం కింద వివా హాలు జరుపనున్నట్లు తెలిపారు. అలాగే ప్రభు త్వం ఆధ్వర్యంలో పేద ముస్లింలకు జిల్లాకు ఒక బాలికలు, బాలుర హాస్టళ్లను నిర్మించనున్నట్లు, ఇందుకోసం రూ.13 కోట్ల ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకొక రెసిడెన్షియల్ పాఠశా లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు మాట్లాడుతూ తమ హక్కుల కోసం ఒక్కతాటి పైకి వచ్చి పోరా డితే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలి పారు. తెలంగాణ ముస్లిం విద్యావంతుల వేదిక ప్రతినిధులను ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీతో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసు కళ్త నని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనంసాక్షి పత్రిక ఎడిటర్ ఏఆర్ రహమాన్, ఫజీల్ హుస్సేన్, కమలుద్దీన్, జియావొద్దీన్, రియాద్ అలీ రజ్వి తదితరులు ప్రసంగించారు.