విదేశీ సహాయక బృందాలు ఖాట్మండ్‌ను వదిలి వెళ్లాలి-నేపాల్ ప్రభుత్వం
ఖాట్మాండ్: నేపాల్ సహాయక చర్యల్లో పాల్గొంటున్న విదేశీ బృందాలు రాజధాని ఖాట్మండ్ నుంచి తిరిగి వెళ్లిపోవాలని ప్రభుత్వం కోరింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా వేలాది మంది రాజధానిలోని స్వయంభునాథ్ ఆలయాన్ని సందర్శించుకోవాడానికి రానుండటంతో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. రాజధాని..దాని పరిసర ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు పూర్తయ్యాయని.. మిగతా చోట్ల సహాయక కార్యక్రమాలను స్థానికులు చూసుకుంటారని ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మినేంద్ర రిజెల్ తెలిపారు. ఈ నెల 25న భారీ భూకంపం నేపాల్‌ను కుదిపేయడంతో 34 దేశాలకు చెందిన 4 వేల 50 మంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అత్యవసర వైద్యం..ఆహారం..వస్తువులను పంపిణీ చేస్తున్నారు.