విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్, తెలంగాణకు తీవ్ర అన్యాయం ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమావత్ లక్ష్మణ్ నాయక్.



కొండమల్లేపల్లి ఫిబ్రవరి 2 (జనంసాక్షి) న్యూస్ :
పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన 2023 బడ్జెట్లో ఇటీవలి కాలంలో లేవనెత్తిన దాదాపు అన్ని విద్యారంగ అవసరాలను మరియు దేశ విద్యార్ధుల, సంస్థల డిమాండ్లను విస్మరించిందని ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రామావత్ లక్ష్మణ్ నాయక్. ఆవేదన వ్యక్తం చేస్తుంది.
అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగానికి ఈ బడ్జెట్‌లో నిర్దిష్ట ప్రకటనలు ఏమి బిజెపి ప్రభుత్వం చేయలేదు. ఇది ప్రభుత్వ విద్యపై ఉన్న నిర్లక్ష్యాని తెలియజేస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొత్తం బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి కూడా ‘ప్రభుత్వ విద్య’ అనే పదాన్ని ప్రస్తావించలేదు. దీనిని బట్టి ఏంత నిర్లక్ష్యం ఉందో అర్ధం చేసుకోవచ్చు. బడ్జెట్ ప్రసంగం మొత్తం విద్య ప్రభుత్వ బాధ్యత అనే భావన నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నట్లు ఉంది. గత బడ్జెట్లో విద్యారంగానికి 2022-23 బడ్జెట్ అంచనా మొత్తంలో 2.64% కేటాయింపు చేస్తే ఈ బడ్జెట్ అంచనాలో 2.50%కి తగ్గింది. అలాగే విద్యకు జిడిపిలో 3% కూడా హామీ ఇవ్వలేదు. ఇది ప్రభుత్వం తీసుకుని వస్తున్న నూతన విద్యా విధానం అమలు చేయడానికి వాగ్దానం చేసిన దానిలో సగం మాత్రమే. జాతీయ విద్యా మిషన్‌కు బడ్జెట్‌లో 600 కోట్లు కేటాయించారు. ఇది కూడా గత బడ్జెట్ కంటే తక్కువ. విద్యా సాధికారత కోసం గత బడ్జెట్ నుండి 826 కోట్లు కేటాయింపు చేశారు. ప్రస్తుత దాని ప్రస్థావన లేదు. ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE 2020-21) ప్రకారం 2020-21లో విద్యలో SC విద్యార్థుల నిష్పత్తి 14.2%కి పడిపోయింది, అంతకుముందు సంవత్సరం 14.7%. OBC విద్యార్థుల నిష్పత్తి 37% నుండి 35.8%కి మరియు ముస్లిం విద్యార్థులు 5.5% నుండి 4.6%కి పడిపోయింది. వికలాంగుల విభాగంలో విద్యార్థుల సంఖ్య కూడా 92,831 నుండి 79,035కి పడిపోయింది. ఈ అసమానంగా తగ్గిపోతున్న విద్యార్థుల నిష్పత్తులన్నీ గత అనేక సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాల ఫలితంగా ఏర్పడినవి. మరియు ప్రతి సంవత్సరం ఈ అసమానతలు పెరుగుతున్నాయి. ఈ అసమానతలు ఏందుకంటే విద్యారంగంలో గత అనేక సంవత్సరాలు నుండి అమలు చేస్తున్న నయా-ఉదారవాద విధానాల ఫలితం, విద్య ప్రైవేటీకరణకు దారితీసింది. మరియు అట్టడుగు వర్గాల విద్యార్థులను చదువుకు వెళ్ళకుండా నెట్టివేసింది. ఒకటో తరగతికి చేరిన విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఉన్నత పాఠశాలలోనే విద్యనుమానేస్తున్నారు. హయ్యర్ సెకండరీ విద్యను పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యలో ప్రవేశించే భారతీయ విద్యార్థుల సంఖ్య ఇప్పటికీ 30% కంటే తక్కువగా ఉంది. మన దేశంలో ఉన్నత విద్య, కొత్త కళాశాలలు విశ్వవిద్యాలయాలు ప్రతి ప్రాంతంలో మెరుగైన సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మరియు ఫెలోషిప్‌లు, ఉచిత స్టడీ మెటీరియల్‌లు, హాస్టళ్లు, సరైన మధ్యాహ్న భోజన పథకం మొదలైన వాటితో సహా అణగారిన వర్గాల విద్యార్థులకు తగినంత మద్దతు కల్గిన వ్యవస్థ కోసం మరిన్ని నిధులు అవసరం. కానీ ఈ యూనియన్ బడ్జెట్‌లో కేటాయింపులు జరగలేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క అత్యంత విద్యార్థి వ్యతిరేక బడ్జెట్‌పై SFI అత్యంత తీవ్రమైన నిరసన తెలిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేసింది. ఐఐటి హైదరాబాద్, మను,టిస్,లాంటి విద్యాసంస్థల అభివృద్ధి కోసం తగిన బడ్జెట్ లేదు. గిరిజన యూనివర్శీటికి కేవలం 39 కోట్లు మాత్రమే కేటాయింపు చేశారు. మధ్యాహ్న భోజనం కోసం లేవు. కోత్త విద్యాసంస్థల ఏర్పాటు గురించి ప్రస్థావన లేదు. కేంద్రీయ విద్యాసంస్థల అభివృద్ధికి కూడా బడ్జెట్ నిధులు లేవు. తెలంగాణ విద్యారంగానికి తీవ్ర నిర్లక్ష్యం చేయడానికే ఈ బడ్జెట్లో ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తుంది అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు

తాజావార్తలు