విద్యారంగా సమస్యలను పరిష్కరించాలి
పీడీఎస్ యు రాష్ట్ర నాయకులు ఎర్ర అఖిల్ కుమార్
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్ యు రాష్ట్ర నాయకులు ఎర్ర అఖిల్ కుమార్ డిమాండ్ చేశారు.సోమవారం ఆ సంఘ జిల్లా కమిటీ అధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 3600 కోట్ల రూపాయల స్కాలర్షిప్ , ఫీజు రీయింబర్స్మెంట్స్ పెండింగ్ లో ఉన్నాయన్నారు.ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు.ప్రభుత్వ పాఠశాలలో మాదిరి జూనియర్ కళాశాల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలన్నారు.అద్దె భవనాల్లో ఉన్నటువంటి హాస్టల్ కు సొంత భవనాలను ఏర్పాటు చేయాలని కోరారు.గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులందరికీ ఉచితంగా బస్సు పాస్ లు ఇవ్వాలన్నారు.విద్యా రంగ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే తమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పల్లపు ఈశ్వర్ , నరేష్ , హుస్సేన్ , రాణి , మంజుల, కృష్ణ , గీత, స్వప్న , మాధురి, కవిత, మహేష్, రమేష్ , రాము, నరేష్ తదితరులు పాల్గొన్నారు.