విద్యార్థిని దారుణ హత్య
కందుకూర్ : రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండంల దాసర్లపల్లిలో విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. కందుకూరులో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని నిన్న సెలవు కావడంతో వూరికి వచ్చింది. సాయంత్రం పొలం పనులకు వెళ్లిన అమెపై ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల నరేష్ అనే యువకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు ప్రతి ఘటిండచడంతో నరేశ్ ఆమెను తీవ్రంగా కొట్టి చెట్టుకు ఉరివేశాడు.. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.