విద్యార్థి దశలోనే సంస్కారం అలవర్చుకోవాలి

గ్యాంగ్‌రేప్‌పై రాష్ట్రపతి విచారం
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి):
పారామెడికల్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మంగళవారంనాడు స్పందించారు. ఈ ఘటన తీవ్ర విచారకరమైనదని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ఘటన పట్ల విద్యార్థులు ఇతర సమాజం ఆం దోళన, ఆగ్రహం వ్యక్తం చేయడం సరైన చర్యే అయినప్పటికీ హింసా త్మకంగా మారడం సరైంది కాదని ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. హింస సమస్యకు పరిష్కారం కాదని అన్నారు. మంగళవారంనాడు మోతీ లాల్‌ నెహ్రూ జాతీయ సాంకేతిక విద్యాసంస్థలలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రణబ్‌ ముఖర్జీ పాల్గొన్నారు. అత్యాచార ఘటనను నిరసిస్తూ జరిగిన ఆందోళనలో ఒక పోలీస్‌ అధికారి మరణించడం పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆందోళనలో పాల్గొంటున్న యువత తమ భావావేశాలను అదుపు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తిచే శారు. ఈ
ఘటనపై ప్రభుత్వం తక్షణమే తగిన చర్చలు తీసుకుంటుందని ఆందోళన కారులకు రాష్ట్రపతి హామీ ఇచ్చారు. దేశరాజధానిలో ఒక యువతిపై ఇలాంటి కిరాతక చర్యకు పాల్పడిన సంఘటన తీవ్ర విచారం కలిగిస్తోందన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఆందోళన సరైనదే అయినప్పటికీ హింస మాత్రం సరైనది కాదని ఆయన అన్నారు. యువత భావోద్రేకాలకు లోనుకాకుండా ఉండాలని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. బాధితురాలిని ధైర్యవంతురాలిగా కొనియాడుతూ.. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ప్రణబ్‌ చెప్పారు. సమాజంలో మహిళలపట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయన్నారు.