విద్యార్థులకిచ్చే బస్సు పాస్ ఛార్జీల పెంపు యోచనను విరమించకోవాలి
ఖమ్మం సంక్షేమం: విద్యార్థులకిచ్చే బస్సుపాస్ ఛార్జీల పెంపు యోచనను విరమించుకోవాలని పీడీఎన్‌యూ ఆధ్వర్యంలో బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎన్‌యూ జిల్లా కార్యదర్శి ప్రదీప్ మాట్లాడుతూ ఇప్పటికే వివిధ రకాల భారాలను ప్రజలపై మోపిన ప్రభుత్వం పేద విద్యార్థులపై కూడా భారం మోపటం సమంజసం కాదన్నారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఎంకు అందజేశారు. కార్యక్రమంలో నరేష్, విప్లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.