విద్యార్థులకు ఏకరూప దుస్తులు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలి

ఫోటోరైటఫ్:సమావేశంలో మాట్లాడుతూన్న సీఆర్పీఎఫ్ కన్వీనర్ వరకాల అంజయ్య
పెన్ పహాడ్. జూలై   (జనం సాక్షి) : విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక మండల కన్వీనర్ వరకాల అంజయ్య అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని ఎం ఆర్ సి భవన్ లో మండల కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో బీసీ బాలుర వసతిగృహనికి పక్కా భవనం ఏర్పాటు చేయాలని, జ్యోతిరావు పూలే బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలకు స్థలం కేటాయించి పక్కా భవనం నిర్మించాలని, బోధనకు తగ్గ ఉపాధ్యాయులను నియమించాలని, పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం క్రమం తప్పకుండా నిర్వహించాలని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మండల విద్యాధికారి నకిరేకంటి రవికి అందజేశారు ఈ కార్యక్రమంలో డివిజనల్ అధ్యక్షులు గజ్జెల ధర్మారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నల్లపు శ్రీనివాస్, మండల  కార్యదర్శి ఒగ్గు సోమన్న, కోశాధికారి దాసరి మట్టయ్య, నారాయణ రామచంద్రారెడ్డి,కందిమళ్ళ మధుసూదన్ రెడ్డి, వరకాల లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు…
 
Attachments area