విద్యార్థులకు ఫ్రీ పాసులు ఇచ్చారు. సరైన సమయానికి బస్సు రావట్లేదు. పాఠాలు వినకుండానే బస్సు కొరకు పరుగులు.
కోడేరు (జనం సాక్షి) జూలై 07 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ మరియు మోడల్ స్కూల్ విద్యార్థుల కు ఆర్టీసీ వాళ్ళు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. జనుం పల్లి మరియు తీగలపల్లి గ్రామాల విద్యార్థుల కు సాయంత్రం వేళలో కొల్లాపూర్ నుండి వచ్చే బస్సు కోడేరు కు సాయంత్రం 4 గంటలకే రావడం వల్ల విద్యార్థులను ఒక పిరియేడు ముందుగానే వదిలి పెట్ట వలసి వస్తుందని ఆ 30 మంది విద్యార్థులకు 1 పీరియడ్ లాస్ అవుతుందని జెడ్పీ ఎచ్ ఎస్ కోడేరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి కృష్ణయ్య ఆవేదన వ్యక్తంచేశారు.ఆర్టీసి అధికారులు విద్యార్థిలను దృష్టిలో పెట్టుకుని ప్రతి రోజు సాయంత్రం కొల్లాపూర్ నుండి 4.00 గంటలకు బయలు దేరి కోడేరుకు 4.45 లేదా 5.00 వరకు వచ్చి, కోడేరు నుండి నాగర్ కర్నూల్ కు బయలు దేరే విదంగా కొల్లాపూర్ డిపో ఆర్టీసి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తీగల పల్లి జనుపల్లి గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు.విద్యార్థల భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని ఈ చిన్న సవరణ చేయాలని ప్రధానోపాధ్యాయులు సి కృష్ణయ్య, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు,కొల్లాపూర్ ఆర్టీసి డిపో అదింకారులను పత్రికా ముఖంగా కోరారు.లేకపోతే దాదాపు 30- 35 విద్యార్థులు నష్టపోతారని వారు విజ్ఞప్తి చేశారు.