విద్యార్థులను అభినందించిన కలెక్టర్‌

రాజన్న సిరిసిల్ల,మే25(జ‌నంసాక్షి): జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి గత మార్చ్‌ నెలలో పదవ తరగతి పరీక్షలు రాసి ఆయా మండలాల్లో మొదటి, రెండవ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు,వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలను కలెక్టర్‌ అభినందించారు. బి సి ఉపాధ్యాయ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫూలే ప్రతిభా పురస్కారాలతో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఆధవ్యంలో శుక్రవరాం సిరిసిల్లలోనీ పొదుపు భవన్లో నిర్వహించచారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు,