విద్యార్థులు ఉగ్రవాదులా?
– ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థుల అరెస్టుపై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ,ఆగస్ట్19(జనంసాక్షి):
గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న పుణె ఫిలిం ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. వారిని అరెస్టు చేయడం పట్ల మోదీపై విమర్శలు గుప్పించారు. విద్యార్ధులు క్రిమినల్స్ , ఉగ్రవాదులు కాదన్నారు.
మంగళవారం అర్ధరాత్రి దాటాక అయిదుగురు ఫిలిం ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ఖండిస్తూ ‘ఆందోళన చేస్తున్న విద్యార్థులను అర్ధరాత్రి అరెస్టు చేశారు. విద్యార్థులు క్రిమినల్స్ కాదని అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఫిలిం ఇన్‌స్టిట్యూట్చీఫ్‌గా గజేంద్ర చౌహాన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. గతంలో రాహుల్ విద్యార్థుల వద్దకు వెళ్లి ఆందోళనకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్ల సాధన కోసం దీక్ష చేస్తున్న విద్యార్థుల్ని అరెస్టు చేయటానికి వారేమన్నా.. క్రిమినల్సా అని అన్నారు.