విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువులో రాణించాలి :ఎస్సై వి సురేష్

విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువులో రాణించాలి :ఎస్సై వి సురేష్

తిరుమలగిరి (సాగర్) అక్టోబర్ 12 (జనంసాక్షి):
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువులో రాణించి ఉన్నత స్థానాలకు చేరాలని తిరుమలగిరి (సాగర్) ఎస్సై వి సురేష్ అన్నాడు. గురువారం మండల కేంద్రంలోని శ్రీ చైతన్య విద్యాలయం , ది గ్రేట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన, ముందస్తు బతుకమ్మ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు ఎక్కువగా మొబైల్ ఫోన్లను వాడకూడదని సూచించారు. చదువు పట్ల శ్రద్ధ చూపి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు .అనంతరం ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రదానోప్యాధ్యాయులు ఎల్ బ్రహ్మచారి ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, నాగయ్య, శ్యామ్ సుంధర్ రెడ్డి, వెంకన్న, బషీర్, ఆంజనేయులు, నరేష్, మంజుల, మోక్ష, సరిత, శోభారాణి, లక్ష్మి, మాధవి, జమీల, శ్రీలత, కల్పన, తనవీర్, సఫియా తదితరులు పాల్గొన్నారు