విద్యార్థులు స్కూలుకు వెళ్లాలంటే ఇదే మార్గం…

636054005056643039ఉత్తరాఖండ్‌ : విద్యార్థుల జీవితాలతో ఉత్తరాఖండ్‌ నేతలు చెలగాటమాడుతున్నారు. అలకనందానదిపై బ్రిడ్జి లేకపోవడంతో రోప్‌ వే సాయంతో నదిదాటుతూ స్కూల్‌కు వెళుతున్నారు. అది ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌… ఇక్కడ విద్యార్థులు ప్రతి రోజూ నదిని ఇలానే దాటుతుంటారు. అలకనందా నది ఒడ్డున ఉన్న ఆ ఊరి ప్రజలు ఏ చిన్న అవసరం వచ్చినా నది దాటి వెళ్లాల్సిందే. విద్యార్థులు, ఉద్యోగులు… ఎవరైనా సరే.. ప్రతి రోజూ రోప్‌వే సాయంతోనే నదిని దాటుతారు.

గతంలో ఈ నిదిపై వంతెన ఉండేది. రెండేళ్ల క్రితం వరదలకు కొట్టుకుపోయింది. కొత్తగా వంతెన నిర్మిస్తామని సీఎం హరీష్‌ రావత్ చాలాసార్లు చెప్పారు. అయితే ఇప్పటివరకు శంకుస్థాపన కూడా జరగలేదు. రోప్‌ వేతో నదిని దాటాలంటే భయమేస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. తాము ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని స్థానికులు వాపోయారు.