విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తం
ఖమ్మం: బోధనారుసుముల చెల్లింపుల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిధి గృహం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది బోధనారుసుములు పూర్తిగా ప్రభుత్వమే చెల్లించాలని నినాదాలు చేస్తూ అతిధిగృహంలోకి దూసుకెళ్లేందుకు విద్యార్థులు యత్నించారు. దీంతో అక్కడ భారీగా మోహరించిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది.