విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ప్రదర్శన
గాంధీచౌక్ (ఖమ్మం): రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మయూరి సెంటర్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వామపక్ష నాయకులు బీవీ రాఘవులు, కే నారాయణ హైదరాబాద్‌లో చేస్తున్న నిరాహారదీక్షకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం డివిజన్‌లో నాయకులు అఫ్రోజ్ సమీనా, ఎర్రా శ్రీనివాసరావు, విక్రమ్, దాసరి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.