విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టరు అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు
వైరా: విద్యుత్తు స్తంభాన్ని ట్రాక్టరు ఢీకొట్టింది. స్థానిక బస్టాండ్ ఎదురుగా గల మార్కెట్ ఏరియాలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విద్యుత్తు స్తంభం విరిగిపోయింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.