విద్యుత్‌షాక్‌కు గురై ఒక రైతు మృతి
కడప, జూలై 28 : చేతికి వచ్చిన పంట అడవి పందులు కాకుండా కాపాడుకునేందుకు ఇరుగురు రైతులు తమ పొలం చుట్టూ ఉంచిన విద్యుత్ తీగల వల్ల ఒక రైతు మృతి చెందాడు. గాలివీడు మండలం నాయనపల్లి గ్రామంలో శనివారం ఈసంఘటన జరిగింది. ఈ గ్రామంలోని మహేశ్వరరెడ్డి, నరసింహారెడ్డి అనే ఇద్దరు రైతులు వేరు శనగ పంటను రక్షించేందుకు విద్యుత్ తీగలను పొలం చుట్టూ అమర్చారు. ఈ విషయం తెలియని అదే గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(50) అనే రైతు తన పొలం వద్దకు వెళుతు పొరపాటున వైరు కాలికి తగలటంతో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడిక్కక్కడే మరణించాడు. ఈ విషయం మృతుడి కుమారుడు పురుషోత్తమరెడ్డి గాలివీడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.