విద్యుత్‌ కోతకు నిరసనగా రైతుల రాస్తారోకో

నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని బోధన్‌ హైదరాబాద్‌ రోడ్డుపై శుక్రవారం మండలానికి చెందిన రైతులు విద్యుత్తు కోతలకు నిరసనగా రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. నిరంతరాయంగా ఏడుగంటలపాటు విద్యుత్తు ఇస్తానన్న ప్రభుత్వం రెండు గంటలు కూడా ఇవ్వటం లేదన్నారు. ఎస్సై అంజయ్య, తహశీల్థార్‌ నారాయణ, విద్యుత్తు ఏఈ గోపి ధర్నా వద్దకు చేరుకొని రైతులతో చర్చించారు. రైతులు