విద్యుత్‌ కోతలను నిరసనగా రాస్తారోకో

 

దమ్మపేట: మండలంలో సోమవారం విద్యుత్తు కోతలకు నిరసనగా రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతులకు నిరంతరాయంగా 7గంటలు విద్యుత్‌ ఇవ్వాలని, కరెంట్‌ కోతలను ఎత్తి వేయాలని మందలపల్లి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్‌ సిబ్బందిని సబ్‌స్టేషన్‌లో నిర్భందించారు.