విద్యుత్ కోతలపై గ్రానైట్ వ్యాపారుల ఆందోళన
ఖమ్మం: విద్యుత్ కోతలను నిరసిస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ వ్యాపారులు, కార్మికులు ఆందోళనకు దిగారు. మద్దులపల్లి, ఆరెంపల్లి, పల్లెగూడెం, ఖానాపురం, ముదిగొండ సబ్‌స్టేషన్ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే కోతలను ఎత్తివేసి గ్రానైట్ పరిశ్రమలను అదుకోవాలని డిమాండ్ వ్యక్తం చేశారు.