విద్యుత్ కోత సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి:కొదండరాం
ఖమ్మం: విద్యుత్‌కోత సమస్యను పరిష్కరించాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదాండరాం అన్నారు. విద్యుత్‌కోతలకు నిరసనగా ఈరోజు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వాసులు ఖమ్మం-హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న కోదాండరాం వాహనం కూడా ట్రాపిక్ జాంలో ఇరుక్కుపోయింది. విషయం తెలుసుకున్న కొదాండరాం దిగివచ్చి ఆందోళన కారులతో కలసి రోడ్డుపై బైఠయించారు. అనంతరం మాట్లాడుతూ వ్యవసాయరంగానికి నిర్ణీతసమయం విద్యుత్‌ను సరఫరా చేయాలని ప్రభుత్వం గృహ అవసరాలకు కూడా సమకూర్చలేక పోతుందని అన్నారు.