విద్యుత్ తీగలు తగిలి యువకుడు బలయ్యాడు
ఇల్లందు : పోలాలకు అమర్చిన విద్యుత్‌తీగలు తగిలి యువకుడు బలయ్యాడు. మండలంలోని ఇందిరానగర్ హిందూ స్మశానవాటిక సమీపంలో కోతులు అడవి జంతువులు బెడద నుంచి పంటను రక్షించుకోనేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఎస్. సాగర్ (30) మృతి చెందారు. కాకర కాయలు తెచ్చుకోనేందుకు వెళ్లిన సాగర్‌కు ప్రమాదవశాత్తు తీగలు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సాగర్ ఏసోబు ఫిర్యాదు. మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.